పేరుకు తగ్గట్టే న్యాచురల్ కథలతో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే నాని ఈసారి పూర్తిగా ఊర మాస్ అవతారంలోకి దిగిపోయాడు. దసరా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి దీని మీద ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. నేను లోకల్ తర్వాత కీర్తి సురేష్ తో నాని జట్టు కట్టిన సినిమా ఇదే. శ్రీకాంత్ ఓదెలని దర్శకుడిగా పరిచయం చేస్తూ రా అండ్ రస్టిక్ డ్రామాగా భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించారు. తెలుగులో రాజమౌళితో పాటు వివిధ భాషల్లో సెలబ్రిటీలతో ఒకేసారి టీజర్ లాంచ్ చేయించి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ప్రమోషన్లు మొదలుపెట్టారు.
కథను లైట్ గా చెప్పేశారు. ఈర్లపల్లి అనే గ్రామం బయట ప్రపంచానికి అంతగా తెలియదు. చుట్టూ బొగ్గు గనులు వాటి మీదే ఆధారపడి వందలాది కుటుంబాలు. అందులో దమ్ము పొగరు కలిసున్న ఓ యువకుడు(నాని)కి భయమంటే తెలియదు. ఎవడిని లెక్క చేయడు. అతనితో పాటు అక్కడుండే జాతి మొత్తానికి సారా తాగడం వ్యసనం కాదు అలవాటు. అలాంటి వాళ్ళ జీవితంలో అలజడి రేగుతుంది. వాడికి వ్యవస్థతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అసలు కల్లాకపటం తెలియని ఆ మనుషులు విష వలయంలో ఎలా చిక్కుకున్నారనేదే స్టోరీగా క్లూ ఇచ్చారు.
విజువల్స్ తోనే ఎంత ఇంటెన్సిటీ ఉందో సాంపుల్ ఇచ్చేశారు. పుష్ప తరహా క్యారెక్టరైజేషన్ అనిపించినప్పటికీ దాన్ని మించిన వయొలెన్స్ యాక్షన్ కొత్త దర్శకుడైన శ్రీకాంత్ ఓదెల సెట్ చేసిన తీరు ఆసక్తి పెంచేలా ఉంది. సాయికుమార్ లాంటి ఒకరిద్దరు ఆర్టిస్టులను తప్ప హీరోయిన్ ని సైతం రివీల్ చేయలేదు. ట్రైలర్ కోసం దాచి ఉంచారు. ఇన్నేళ్ల కెరీర్ లో నాని మొదటిసారి అవుట్ అండ్ అవుట్ నాటు గెటప్ లో విస్మయంతో పాటు భయం కలిగించేలా ఉన్నాడు. చివరి షాట్ లో కత్తితో వేలు కోసుకుని నుదుటన బొట్టు పెట్టుకునే సీన్ ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇవ్వడానికి. మార్చి 30 దసరా రిలీజ్ కానుంది .
This post was last modified on %s = human-readable time difference 4:30 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…