ఎల్లుండి పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలుకాబోతున్న పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబో మూవీ తాలూకు లీక్డ్ అప్ డేట్స్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. ఇందులో పవర్ స్టార్ కి ఎలాంటి పాటలు కానీ ఫైట్లు కాని ఉండవనే ప్రచారం పెద్ద కలకలమే రేపుతోంది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా దీనిపై విపరీతమైన చర్చలు మొదలుపెట్టేశారు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు OG ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పేరుతో ఇచ్చిన ట్యాగ్ చూసి ఫ్యాన్స్ ఇందులో భీభత్సమైన యాక్షన్ ఉంటుందని ఆశించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న పెయింటింగ్స్ కూడా అవే సూచించాయి.
కానీ ఇప్పుడొచ్చిన గాసిప్స్ దానికి భిన్నంగా ఉన్నాయి. ఇదొక్కటే కాదు పవన్ స్క్రీన్ టైం కూడా గంటలోపే ఉంటుందని మరో పుకారు షికారు చేస్తోంది. ఇవన్నీ పవన్ ఫాలోయర్స్ ని కలవర పెడుతున్నాయి. ఎందుకంటే సాంగ్స్ ఫైట్స్ లేకుండా పవన్ ని ఊహించుకోలేం. ఖుషిలో పాటలు, గబ్బర్ సింగ్ లో ఫైట్లు, అత్తారింటికి దారేదిలో ఎమోషన్లు ఇలా అన్ని రకాలుగా పండితేనే బాక్సాఫీస్ వద్ద పవన్ సునామి సృష్టిస్తాడు. అదేమీ లేకుండా ఉట్టి హై వోల్టేజ్ క్యారెక్టరైజేషన్ అంటే నమ్మశక్యంగా లేదు. కెజిఎఫ్ లాగా కేవలం ఎలివేషన్లతోనే సరిపుచ్చుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఈ డౌట్లకు ఓపెనింగ్ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశాలు తక్కువే. అసలు టైటిలే రివీల్ చేయకపోవచ్చు. ఇవన్నీ చూస్తూ ఫ్యాన్స్ ఒకింత నిరాశ గురవుతున్నారు కానీ నిజానికి సుజిత్ ని అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. సాహో ఎంత ఫ్లాప్ అయినా అందులో హీరోయిజంని డీల్ చేసిన తీరు యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కించిన విధానం నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా నచ్చేసింది. అలాంటప్పుడు పవన్ ని సరిగా చూపించకపోవడమనే సమస్యే ఉండదు. పైగా మాఫియా గన్నులు తరహా బ్యాక్ డ్రాప్ కాబట్టి ఓజి గురించి అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు.
This post was last modified on January 28, 2023 11:17 am
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…