మన సినిమాలకు అంత సీన్ లేదు!

ఓటిటి ప్లాటుఫామ్ లో వచ్చే సినిమాలకో అడ్వాంటేజ్ ఉంది. సబ్ టైటిల్స్ సౌకర్యం ఉండడంతో భాష రాని వాళ్ళు కూడా సినిమా బాగుందనే టాక్ వస్తే చూసేస్తారు. అలా వైడ్ ఆడియన్స్ కి రీచ్ అయిన సినిమాలతోనే ఓటిటి సంస్థలు డబ్బు చూస్తాయి.

సినిమా థియేటర్లు మూత పడిన ఈ సమయంలో సినీ ప్రియులు మాములుగా కంటే అధికంగా పరభాషా సినిమాలు చూస్తున్నారు. మలయాళం, తమిళం, కొన్ని కన్నడ సినిమాలకు కూడా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు దొరికారు.

కానీ తెలుగు సినిమాలకు మాత్రం ఆ స్థాయిలో రీచ్ రాలేదు. తెలుగు సినిమాల్లో సహజత్వం తక్కువ, మసాలా ఎక్కువ అనే జనరల్ అభిప్రాయానికి తగ్గట్టే ఎక్కువ సినిమాలు ఉండడంతో మన చిత్రాలు ట్రెండ్ అయిన దాఖలాలు కనిపించలేదు.

మనకు కూడా అర్జున్ రెడ్డి, కేరాఫ్ కంచరపాలెం లాంటి ఉత్తమ చిత్రాలు కొన్ని వచ్చినా మసాలా స్టఫ్ ఎక్కువ. ఈ కారణంగానే నెట్ ఫ్లిక్స్ లాంటి బిగ్ ప్లేయర్ మన సినిమాలు కొనేందుకు అంత ఆసక్తి, ఉత్సాహం చూపించడం లేదట. ఓటిటిలో కూడా మనం బాహుబలి అనిపించుకోవాలంటే యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలపై ఫోకస్ ఎక్కువ పెట్టాలి.