Movie News

సుధీర్ బాబు.. ది పెర్ఫామర్

కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుధీర్ బాబు.. కొన్నేళ్ల పాటు అదే ముద్రతో కొనసాగాడు. మొదట్లో తెరపై అతణ్ని చూడడం చాలా ఇబ్బందిగా ఉండేది. తన హావభావాలు అంతగా ఆకట్టుకునేవి కావు. డైలాగ్ డెలివరీ చాలా పూర్‌గా అనిపించేది. ‘ప్రేమకథా చిత్రమ్’ సూపర్ హిట్టయినా కూడా అతవికి ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. తన గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు చూసి సుధీర్ నటుడిగా ఎప్పటికీ మెరుగుపడడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే సినిమాతో తొలిసారి సుధీర్‌లో ఉన్న నటుడు బయటికి వచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా సుధీర్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నన్ను దోచుకుందువటే చిత్రంతో ఇంకో మెట్టు ఎక్కాడు. ఇక ‘సమ్మోహనం’ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. చాలామంది ఈ సినిమాలో సుధీర్ పెర్ఫామెన్స్ చూసి షాకైపోయారు. తనలో ఇంత మంచి నటుడున్నాడా అనుకున్నారు.

ఐతే ‘సమ్మోహనం’తో మంచి పేరు సంపాదించడమే కాక సక్సెస్ కూడా అందుకున్న సుధీర్.. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. ఎంతో కష్టపడి చేసిన ‘వి’తో పాటు శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తనకు నిరాశనే మిగిల్చాయి. కానీ ఈ చిత్రాల్లో కూడా తన నటనకు వంక పెట్టడానికి వీల్లేకపోయింది. నటుడిగా అతను ప్రతి సినిమాకూ పరిణతి చెందుతున్న విషయం స్పష్టంగా కనిపించింది.

ఇక ఇప్పుడు ‘హంట్’ మూవీతో సుధీర్ బాబు మరోసారి మెప్పించాడు. ఇందులో అతడిది డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. దానికి నెగెటివ్ టచ్ కూడా ఉంది. క్లైమాక్సులో తన పాత్రకు సంబంధించిన ట్విస్టే సినిమాలో మేజర్ హైలైట్. ఆ ట్విస్టు బయట పడ్డపుడు.. ఆ తర్వాతి సన్నివేశాల్లో సుధీర్ నటన ఆశ్చర్యపరుస్తుంది. ఎక్కువ హడావుడి చేయకుండా సటిల్‌గా ఆ సన్నివేశాల్లో అతను పెర్ఫామ్ చేసిన తీరు కట్టిపడేస్తుంది. నటుడిగా అతనెంత మెచ్యూరిటీ సాధించాడో ఈ సన్నివేశాలే చాటిచెబుతాయి. కానీ ప్లాట్ పాయింట్, ట్విస్టు బాగున్నా సినిమా ఓవరాల్‌గా అంత ఆకట్టుకునేలా లేకపోవడం దీనికి మైనస్. మంచి కథలు పడితే సుధీర్ బాబు తన పెర్ఫామెన్స్‌తో మరింత ఎలివేట్ చేయగలడన్నది స్పష్టం. కాబట్టి ఇకనైనా సినిమాల ఎంపికలో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరముంది.

This post was last modified on January 27, 2023 6:28 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

45 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago