నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారానికి దారి తీశాయో తెలిసిందే. అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు ఈ రంగారావు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దిగ్గజ నటుల అభిమానులను బాధించాయి. ఏఎన్నార్ మనవళ్లయిన నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా.. అక్కినేని ఫ్యాన్స్ బాలయ్యపై విరుచుకుపడుతున్నారు.
మరోవైపు ఎస్వీఆర్‌ను అవమానించిన బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు పేరుతో కొందరు ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. కాగా ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం బాలయ్య వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏమీ లేదని తేల్చేశారు. ఎస్వీఆర్ మనవళ్లు చిన్న ఎస్‌వీఆర్, ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) ఈ మేరకు వీడియో ప్రకటన విడుదల చేశారు.
”నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం” అని చిన్న ఎస్వీఆర్, బాబాజీ పేర్కొన్నారు.
This post was last modified on January 26, 2023 6:12 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…
2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది.…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి…
2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…