కొన్ని వారాల ముందు వరకు ‘పఠాన్’ టీం బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఈ సినిమాను ఒక వర్గం అదే పనిగా టార్గెట్ చేస్తూ ప్రమోషన్లకు కూడా ఇబ్బంది కలిగించడం, సోషల్ మీడియాలో అదే పనిగా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునివ్వడం చూసి రిలీజ్ టైంలో ఏం జరుగుతుందో ఏమో అనుకున్నారు. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
జనాలు ఈ బాయ్‌కాట్ పిలుపులనేమీ పట్టించుకోలేదు. ఈ సినిమా మీద ఆ వర్గం చూపించిన ద్వేషం కాస్తా.. జనాల్లో సానుభూతికి కారణమైంది. సినిమా ప్రోమోలు కూడా బాగుండడంతో మంచి హైప్ వచ్చింది. ఇంకేముంది.. బాక్సాఫీస్ దగ్గర సునామీకి రంగం సిద్ధమైంది. ఓవైపు ఏడాదిగా పెద్ద పెద్ద హిందీ సినిమాలు కనీసం పది కోట్ల డే-1 వసూళ్లకు కూడా నోచుకోకపోతుంటే.. ‘పఠాన్’ ఏకంగా రూ.50 కోట్ల వసూళ్ల మార్కుపై కన్నేసింది.
‘పఠాన్’కు జరిగిన ప్రి సేల్స్ చూసి బాలీవుడ్ ట్రేడ్ పండిట్లే నోరెళ్లబెట్టేశారు. బుకింగ్స్ ఓపెన్ అయిన రెండు రోజుల్లోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడు కాగా.. ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగింది. విడుదలకు ముందు రోజు ఇండియాలో ప్రి సేల్స్ ఏకంగా 5 లక్షల మార్కును దాటేశాయి.
ఇండియన్ ఫిలిం హిస్టరీలో విడుదలకు ముందు అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘బాహుబలి-2’ పేరిట రికార్డు ఉంది. ఆ సినిమా టికెట్లు ముందే 6.5 లక్షల దాకా అమ్ముడయ్యాయి. గత ఏడాది ‘కేజీఎఫ్-2’ 5.15 లక్షల టికెట్లతో రెండో స్థానంలో నిలిచింది. ‘పఠాన్’ మంగళవారం మధ్యాహ్నానికే 5.25 లక్షల టికెట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరుకుంది. ప్రి సేల్స్ చివరికి 5.5 లక్షల మార్కును కూడా దాటేసి ఉండొచ్చు. ఈ సినిమాకు రిలీజ్ వీక్‌లో ప్రమోషన్లన్నవే లేకపోయాయి. సినిమాను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి ఉంటే ఇంకా హైప్ పెరిగి ‘బాహుబలి-2’ రికార్డుకు కూడా చేరువయ్యేదేమో.
This post was last modified on January 25, 2023 9:48 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…