తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు యావత్ భారతదేశపు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న ఉద్విగ్న ఘట్టంలో మొదటి అంకం విజయవంతంగా పూర్తయ్యింది. ఇందాక ప్రకటించిన ఆస్కార్ 95 నామినేషన్లలో ఒరిజినల్ సాంగ్ విభాగం కింద ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటుకి చోటు దక్కింది. తుది పోరు కోసం నలుగురితో ఎంఎం కీరవాణి పోటీ పడబోతున్నారు. టెల్ లైక్ ఏ విమెన్ నుంచి అప్లాజ్ కు గాను డియన్ వారెన్, టాప్ గన్ మావరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్ పాటకు లేడీ గాగా అండ్ బ్లడ్ పాప్, బ్లాక్ పాంథర్ వాకండ ఫరెవర్ నుంచి లిఫ్ట్ మీ అప్ కు టెమ్స్ – రిహన్న – రియాన్ కూగ్లర్, లుడ్విగ్ గోరన్ సన్ లిస్టులో ఉన్నారు. ఎవరీ థింగ్ ఎవరి వేర్ ఆల్ అట్ వన్స్ నుంచి థిస్ ఈజ్ ఏ లైఫ్ గాను రియాన్ – డేవిడ్ – మిట్స్ కిలకు చోటు దక్కింది.
ఈ అయిదు పాటలకు గాను ప్రతి నామినేషన్ కింద గీత రచయిత పేరు కూడా ఇచ్చారు. చంద్రబోస్ ఆ అరుదైన ఘనతను అందుకున్నారు. మిగిలిన విభాగాల్లో ఒక్కొకటిగా పేర్లు ప్రకటిస్తున్నారు కానీ ఇంకా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి నిరాశే కలుగుతోంది. పెర్ఫార్మన్స్ కు గాను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరికి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుందన్న అంచనా నెరవేరేలా లేదు. ఎప్పుడూ లేనిది భారీ సంఖ్యలో టాలీవుడ్ ఆడియన్స్ యూట్యూబ్ లో ఈవెంట్ ని లైవ్ చూసేందుకు ఉత్సాహపడటం గమనార్హం. నాటు నాటు ప్రకటన రాగానే కలిగిన ఆనందం మాములుగా లేదు.
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ సాధించిన నాటు నాటు కనక నిజంగా ఆస్కార్ పురస్కారం అందుకుంటే స్టేజి మీద ప్రపంచం మొత్తం చూస్తుండగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు లైవ్ డాన్స్ చేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఒక ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి హామీ కూడా ఇచ్చారు. కానీ పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి అంత సులభంగా ఆశలు పెట్టుకోలేం కానీ అలా అని అసాధ్యమని కూడా చెప్పలేం. తెలుగు వాడి విజయపతాకం ఆస్కార్ వీధుల్లో ఎగురుతుందో లేదో ఇంకో రెండు నెలల్లో తేలనుంది. అప్పటిదాకా కీరవాణితో పాటు ఆయన బృందం మొత్తం హై టెన్షన్ ని చవిచూడాల్సిందే.
This post was last modified on January 24, 2023 7:56 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి…
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…
మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ 'ఆఫీసర్ ఆన్…
సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వరుస పెట్టి విమర్శలు…
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన…