Movie News

వారిసు కలెక్షన్లపై కామెడీ

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఇక్కడి స్టార్ డైరెక్టర్లలో ఒకడైన వంశీ పైడిపల్లి.. తమిళ టాప్ స్టార్ విజయ్‌తో రూపొందించిన సినిమా ‘వారిసు’. ఈ కాంబినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ముందు నుంచి చర్చనీయాంశంగా మారింది. రకరకాల కారణాల వల్ల విడుదల ముంగిట ఈ సినిమా మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. రిలీజ్ తర్వాత కూడా వ్యవహారం మారలేదు.

సినిమా మరీ రొటీన్‌గా ఉండడం.. చాలా సినిమాలను కలిపి కిచిడీలా వడ్డించడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి బాగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. తనను, తన సినిమాను ట్రోల్ చేసిన వారి మీద వంశీ కౌంటర్లు వేస్తే.. మళ్లీ అతడి వ్యాఖ్యల్ని పట్టుకుని ఇంకో రౌండ్ ట్రోల్ చేశారు నెటిజన్లు. ఆ ఇంటర్వ్యూలో వంశీ అన్న ‘నాట్ ఎ జోక్ బ్రదర్’ అనే మాట కూడా మీమ్ పేజీల్లో ఒక కల్ట్ డైలాగ్ అయిపోయింది.

ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ‘వారిసు’ కలెక్షన్ల మీద జరుగుతున్న కామెడీ మరో ఎత్తు. ఈ సినిమా రూ.250 కోట్లు వసూలు చేసినట్లుగా తాజాగా పోస్టర్ దించారు. కానీ ట్రేడ్ పండిట్ల అంచనాలకు, నిర్మాణ సంస్థ ప్రకటిస్తున్న వసూళ్లకు అసలు పొంతన లేదన్నది కోలీవుడ్ వర్గాల మాట. తొలి రోజు నుంచి వాస్తవ కలెక్షన్లను అదనంగా కలిపి పోస్టర్లు దించుుతున్నారు.. రోజుకు ఇంత అని ఫేక్ యాడ్ చేస్తున్నారని.. ఆ లెక్కల ప్రకారమే 11 రోజుల్లో రూ.250 కోట్లు వసూలు చేసినట్లుగా కొత్త పోస్టర్ వదిలారని అంటున్నారు.

ఓవైపు ‘తునివు’ బలమైన పోటీ ఇస్తుండగా.. డివైడ్ టాక్‌తో మొదలైన సినిమా 11 రోజుల్లో 250 కోట్లు వసూలు చేయడం ఏంటని.. ఈ నంబర్ ఎంతమాత్రం నమ్మశక్యంగా లేదని.. హీరోను మెప్పించడానికి, తమ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అని చెప్పడానికి.. ఇలా పోస్టర్లు దించుతున్నారని.. దీని వల్ల కలెక్షన్ల వ్యవహారం కామెడీగా మారిపోయిందని నెటిజన్లు ‘వారిసు’ టీం మీద పంచులు వేస్తున్నారు.

This post was last modified on January 24, 2023 4:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago