చిన్న వేషాలతో మొదలుపెట్టి కలర్ ఫోటోతో పెద్ద బ్రేక్ అందుకున్న సుహాస్ కి ఆ సినిమా టైటిల్ లో ఉన్న కలర్ ఒంటికి లేకపోయినా పుష్కలమైన టాలెంట్ తో పాటు సబ్జెక్టు సెలక్షన్ లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అవసరమైతే విలన్ గా చేయడానికి కూడా వెనుకాడనని ఇటీవలే హిట్ 2 ది సెకండ్ కేస్ లో మెప్పించడం ప్రేక్షకులకు గుర్తే. తాజాగా రైటర్ పద్మభూషణ్ గా ఫిబ్రవరి 3న పలకరించబోతున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లను గెస్టులుగా పిలిచి ట్రైలర్ లాంచ్ చేయడంతో సోషల్ మీడియా జనాల దృష్టిలో ఈ సినిమా రచయిత పడిపోయాడు. కాన్సెప్ట్ వెరైటీగానే ఉంది.
నెలకో వెయ్యి రూపాయలు మిగిలితే అదే గొప్పగా ఫీలయ్యే ఓ మధ్యతరగతి తండ్రి(ఆశిష్ విద్యార్ధి) పుత్రరత్నమే ఈ పద్మభూషణ్ (సుహాస్). ఓ పుస్తకం రాసి గొప్ప పేరు తెచ్చుకోవాలని అన్నంత పని చేసి స్వంత ఖర్చుతో పబ్లిష్ కూడా చేయిస్తాడు. తీరా చూస్తే ఒక్క బుక్కు అమ్ముడుపోదు. అయినా ఇతని ప్రతిభను మెచ్చిన ఓ అమ్మాయి(టీనా శిల్పరాజ్) పరిచయం ప్రేమదాకా వెళ్తుంది. కొంత కాలమయ్యాక మనోడి కథలో పెద్ద ట్విస్టు. అసలు సదరు రచనే స్వంతం కాదనే అనుమానం తలెత్తుంది. దీంతో లవ్ తో పాటు లైఫ్ కూడా రిస్కులో పడుతుంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కి గెలిచాడన్నది థియేటర్లో చూడమంటున్నారు.
రొటీన్ గా అనిపించకుండా సుహాస్ తో ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయించడం మంచిదే. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ పాయింట్ బాగుంది. నిజంగా బయట ఉన్న రియాలిటీని తీసుకుని రచయితల అవస్థలకు ప్రేమకథను జోడించడం క్రియేటివ్ ఐడియా. దానికి మంచి క్యాస్టింగ్ తో పాటు కళ్యాణ్ నాయక్ సంగీతం తోడై ఓసారి ట్రై చేయొచ్చనే ఫీలింగ్ కలిగించాయి. సోలో హీరోగా తన థియేటర్ కెపాసిటీ ఇంతవరకు ప్రూవ్ చేసుకొని సుహాస్ కి ఈ రైటర్ పద్మభూషణ్ పెద్ద పరీక్షే. అసలే మైకేల్ లాంటి మల్టీస్టారర్ పోటీ ఉంది. టాక్ బాగుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని రైటర్ గారు ఈజీగానే లాగొచ్చు.
This post was last modified on January 21, 2023 7:49 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…