గత కొన్నేళ్లలో మలయాళం సినిమా స్టాండర్డ్ బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ లు సైతం వాటి మీద మనసుపడి భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ లు రీమేక్ చేసుకునేంతగా. ఆ మధ్య రాజశేఖర్ చేసిన శేఖర్, వచ్చేవారం విడుదల కాబోతున్న బుట్టబొమ్మ ఇవన్నీ మల్లువుడ్ మాలే. అయితే కొన్ని తెలుగులో నిర్మాణం కాకుండా ఓటిటిల ద్వారా నేరుగా డబ్బింగ్ రూపంలో ప్రేక్షకులను పలకరించేస్తున్నాయి. మోహన్ లాల్ మాన్స్టర్, మమ్ముట్టి రోర్సాచ్ అలా వచ్చినవే. తాజాగా ఎలాంటి స్టార్ అట్రాక్షన్ లేని ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ హాట్ స్టార్ లో ఇటీవలే రిలీజయ్యింది.
మన ఆడియన్స్ సోషల్ మీడియాలో దీని మీద పెడుతున్న పోస్టులు ట్వీట్లు చూస్తుంటే కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అయిపోయినట్టు అర్థమవుతోంది. ఇదో వెరైటీ కథ. స్వార్ధం నిలువెల్లా నిండిన లాయర్ ముకుందన్ (వినీత్ శ్రీనివాసన్) యాక్సిడెంట్లు జరిగిన సమయంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇన్సురెన్స్ కంపెనీల నుంచి కోట్లు కొల్లగొట్టే దందాలో అడుగు పెడతాడు. దీని కోసం అవసరమైతే ఎవరికి అనుమానం రాకుండా హత్యలు చేయడానికి వెనుకాడడు. చేతిలో పైసా లేని స్టేజి నుంచి కోటి రూపాయలు అద్దె కట్టే బిల్డింగ్ దాకా ఎదుగుతాడు. ఇదంతా ఎలా జరిగిందనేది స్టోరీ.
ఆద్యంతం కొంత నెమ్మదిగా ఉన్నా దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండటంతో ఎక్కువ విసుగు రాకుండా గడిచిపోతుంది. పైకి మంచివాడిగా కనిపిస్తూ లోపల స్వార్థమనే విషాన్ని నింపుకున్న కన్నింగ్ క్యారెక్టర్ లో వినీత్ ఆకట్టుకున్నాడు. కాకపోతే తప్పుడు దారిలోనే జీవితంలో త్వరగా పైకి చేరుకోగలమనే మెసేజ్ అందరికీ జీర్ణం కాకపోవచ్చు. తప్పు చేస్తేనే గెలుస్తామనే సందేశాన్ని ముకుందన్ ద్వారా చెప్పించారు. ఇలాంటివి మన హీరోలు చేస్తే వర్కౌట్ కావు. ఎందుకంటే కథానాయకుడే విలన్ కాబట్టి. హ్యాపీగా ఇంట్లోనే టైం పాస్ కోసమైతే ఈ లాయర్ ని ఓసారి పలకరించవచ్చు.
This post was last modified on January 20, 2023 1:48 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…