జీవిత సారాన్ని తూటాల్లాంటి మాటలతో.. సూటిగా సుత్తి లేకుండా చెప్పగల నైపుణ్యం ఉన్న రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ తరం యువతకు ఏ స్టయిల్లో చెబితే విషయం ఎక్కుతుందో ఆయనకు చాలా బాగా తెలుసు. నేనింతే, బిజినెస్‌మేన్ లాంటి సినిమాల్లో పూరి బోధించిన జీవిత పాఠాలు చాలామంది మనసుల్లోకి దూసుకెళ్లిపోయాయి.
ఆ మాటలు ప్రీచింగ్‌లా అనిపించకుండా ఆలోచింపజేసేలా.. చురుకు పుట్టించేలా ఉంటాయి. పూరి ఏదైనా చెబుతుంటే వినబుద్ధేయడం ఆయన ప్రత్యేకత. ఐతే తన ఐడియాలజీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు సినిమాలు, సినిమా వేడుకలకు పరిమితం అయిపోకుండా ఇప్పుడో కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు పూరి.
తమ భావాలు చెప్పడానికి ప్రముఖులు ఎంచుకున్న మీడియాలోకి పూరి కూడా వచ్చేశాడు. పోడ్‌కాస్ట్‌లో ఆయన అకౌంట్ తెరించారు. అందులో మ్యూజింగ్స్ పేరుతో తన భావాలు, అనుభవాలు, పాఠాలు పంచుకోవడానికి సిద్ధపడ్డారు. అరంగేట్రంలోనే చక్కటి ఆడియో మెసేజ్‌లతో తన అభిమానుల్ని ఆకర్షించారు పూరి. అందరూ గొప్ప అనుకునే అమెరికాకు అసలు చరిత్ర, సంస్కృతి అంటూ ఏమీ లేవని.. వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త విషయాల గురించి ఆలోచిస్తుంటారని.. కానీ గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్న ఇండియన్స్ వాటిలోకి వెళ్లకుండా, కొత్తగా ఏ ప్రయత్నమూ చేయకుండా కష్టం తెలియకుండా కాలం గడిపేస్తుంటారని అన్నాడు పూరి.
జనాభా పెరుగుదలతో వస్తున్న కష్టాల గురించి కూడా ఇందులో పూరి చక్కగా వివరించాడు. మరోవైపు అమితాబ్ బచ్చన్ మీద కూడా ఆసక్తికర ఆడియో సందేశం పెట్టాడు. ఇవి విన్న ఎవరైనా.. ఇక రెగ్యులర్‌గా పోడ్‌కాస్ట్‌లో పూరీని ఫాలో అయిపోవాల్సిందే అనుకుంటారు. ప్రకాష్ రాజ్ సహా అందరూ పూరి ఫ్యాన్స్‌కు ఇదే పిలుపునిచ్చారు.
This post was last modified on July 21, 2020 10:53 am
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…