బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్నట్లుండి వ్యవసాయంపైకి మనసు మళ్లింది. ఊరికే పొలాల్లో దిగి పోజులివ్వడం కాకుండా కొన్ని రోజులుగా సీరియస్‌గా అతను వ్యవసాయం మీద దృష్టిసారించాడు. రైతులా మారిపోయి పొలం పనులన్నీ చేసేస్తున్నాడు.
ముంబయి శివార్లలో అతడికి భారీ వ్యవసాయ క్షేత్రం ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో కొన్ని రోజులుగా తన సన్నిహితులతో కలిసి సల్మాన్ ఫాం హౌస్‌లోనే ఉంటున్నాడు.
ముందు పొలాల మధ్య సరదాగా తిరిగాడు కానీ.. తర్వాత సీరియస్‌గా పొలం పనుల్లోకి దిగిపోయాడు. ఈ మధ్య ఒళ్లంతా మట్టి పూసుకున్న, వరి నాట్లు పట్టుకున్న ఫొటోలను సల్మాన్ షేర్ చేస్తే.. అతను షో చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
కానీ సల్మాన్ అవేమీ పట్టించుకోలేదు. తర్వా త ట్రాక్టర్ ఎక్కాడు. పొలం దున్నాడు. తాజాగా వరి నాట్లు చేత బట్టి నిజంగానే అందరితో కలిసి తనూ వాటిని నాటాడు. ఊరికే ఫొటోలు, వీడియోల కోసం అన్నట్లు కాకుండా సల్మాన్ మనస్ఫూర్తిగానే ఈ పని చేస్తున్నాడని తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
షూటింగ్స్ లేకుంటే ఎప్పుడూ నాలుగ్గోడల మధ్య ఏసీ గదుల్లో ఉండే సెలబ్రెటీలకు.. ఇలా స్వేచ్ఛగా తిరిగే, వ్యవసాయం చేసే అవకాశం వస్తే దాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు అనడానికి సల్మాన్ రుజువులా కనిపిస్తున్నాడు. సల్మాన్‌లో ఎన్నడూ చూడని ఈ కోణం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మిగతా సెలబ్రెటీలకు కూడా సల్మాన్‌లాగా పొలం పనులు చేయాలని అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on July 21, 2020 10:50 am
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…