Movie News

జక్కన్న మహాభారతం.. ప్రపంచం సిద్ధం

తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత గాథ అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల కిందటే ప్రకటించాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలను ‘మహాభారతం’ తీయడానికి ముందు తనకు తాను పెట్టుకుంటున్న పరీక్షలా.. ఒక ట్రయల్‌ లాగా చెబుతూ వస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలను చూశాక రాజమౌళికి ‘మహాభారతం’ తీయడం అంత కష్టమేమీ కాదని.. ఒకవేళ అది చాలా కష్టమైనా కూడా సాధించగలడని అందరూ నమ్ముతున్నారు.

ఇప్పటికే భారతీయ వెండితెరపై, బుల్లితెరపై మహాభారత గాథను చూసినప్పటికీ.. జక్కన్న మెగా విజన్‌తో ఆ కథను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఐతే బాహుబలి చేయడానికి ముందు.. ‘మహాభారతం’ తీయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం అవసరం అవుతుందని జక్కన్న చెప్పాడు. కానీ ఆ పదేళ్లు పూర్తవడానికి సమయం దగ్గర పడుతున్నా మహాభారతం ఊసు ఎత్తట్లేదు.

ఐతే ఈ మెగా ప్రాజెక్టు ఆలస్యం అయితే అయింది కానీ.. దాని వల్ల ఒక మంచి జరిగిందని చెప్పాలి. ఇప్పటిదాకా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టును తెరపై చూడడానికి భారతీయ ప్రేక్షకులు మాత్రమే ఎగ్జైట్ అవుతూ వచ్చారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. హాలీవుడ్ ప్రేక్ష్ఖకులు సైతం ఆయన పేరెత్తితే ఊగిపోతున్నారు. భారతీయులంతా ఎంతో గర్వించే మహాభారత కథను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్లు ఆదరించడానికి అవకాశం దక్కింది.

బేసిగ్గా మహాభారత కథలోనే గొప్ప విషయం ఉంది. అందులో క్యారెక్టర్లు, ఉపకథలు, మలుపులు అద్భుతం అనే చెప్పాలి. అలాంటి కథను రాజమౌళి తన విజన్‌తో భారీ స్థాయిలో తెరకెక్కిస్తే దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. ప్రపంచం కూడా ఆ కథలోని గొప్పదనాన్ని అర్థం చేసుకుంటుంది. రాజమౌళి మార్కెట్ అసాధారణ స్థాయిలో విస్తరించిన నేపథ్యంలో ఆ సినిమా కలెక్షన్లకు ఆకాశామే హద్దు అవుతుంది. కొన్ని భాగాలుగా తెరకెక్కే ఆ సినిమాను పూర్తి చేస్తే జక్కన్న కెరీర్‌కు అంతకుమించి సార్థకత లేకపోవచ్చు. మహేష్ బాబు సినిమా అవ్వగానే ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ఆశిద్దాం.

This post was last modified on January 18, 2023 10:43 am

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

10 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

11 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

11 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

11 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

13 hours ago