వీరయ్య దర్శకుడికి బన్నీ ఛాన్స్ ?

ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగానే ఆ దర్శకుడితో స్టార్ హీరోలు , నిర్మాతలు సినిమా లాక్ చేసుకోవడం కామన్. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బాబీ కూడా ఓ క్రేజీ కాంబో సెట్ చేసేసుకున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో బాబీ నెక్స్ట్ సినిమా ఉంటుందని విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే చిరంజీవి సినిమా కంటే ముందే బన్నీ కి బాబీ ఓ కమర్షియల్ మాస్ కథ వినిపించాడట. కాకపోతే పుష్ప 2 తర్వాత చూద్దాం అన్నట్టుగా బాబీకి చెప్పాడట అల్లు అర్జున్. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ రిజల్ట్ చూసి బాబీతో బన్నీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఇటీవలే బన్నీ థియేటర్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూడటానికి రీజన్ కూడా అదే అని తెలుస్తుంది. బాబీ సీన్స్ కి ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? బాబీ టేకింగ్ కి ఆడియన్స్ రియాక్షన్ తెలుసుకోవడం కోసమే ఉన్నట్టుండి ప్రసాద్స్ లో మెరిసాడట బన్నీ. నిజానికి ఎన్టీఆర్ తో తీసిన జై లవ కుశ దర్శకుడిగా బాబీ కి మంచి పేరు తెచ్చింది. రిజల్ట్ ఆశించినంత స్థాయిలో లేకపోయినా వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది.

ఆ సినిమా చూసిన వెంటనే బాబీ ను పిలిచి తనకోసం కథ రెడీ చేయమని చెప్పేశాడట బన్నీ. ఆ ప్రాజెక్ట్ ఇన్నాళ్ళుగా ననూతూ వచ్చింది. ఇక బన్నీ నెక్స్ట్ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. రెండు మూడు కథలు ఫైనల్ చేసుకున్నాడు బన్నీ. మరి వాటిని పక్కన పెట్టి పుష్ప2 తర్వాత బాబీ కే సినిమా చేస్తాడా ? తెలియాల్సి ఉంది.