త్రివిక్రమ్ ఈసారైనా గట్టెక్కిస్తాడా?

త్రివిక్రమ్ సినిమాకి ఉన్న సత్తా ఏంటనేది ఆలా వైకుంఠపురములో నిరూపించింది. 150 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా త్రివిక్రమ్ బెస్ట్ సినిమానా అంటే కానే కాదు. కానీ త్రివిక్రమ్ తీసే ఫ్యామిలీ డ్రామాలు అన్నేసి కోట్లు రాబట్టగలవు. అందుకే త్రివిక్రమ్ తో తారక్ చేయబోయే సినిమా కూడా అదే జోనర్ లో ఉండబోతోంది. ఇప్పటికే ఆ సినిమా కథ ఒక కొలిక్కి వచ్చేసిందట.

ఎన్టీఆర్ కూడా రెండు సిట్టింగ్స్ లో కూర్చుని బాగుందని చెప్పేశాడట. ఇక ఈ సినిమా వరకు త్రివిక్రమ్ కి ఉన్న ఆబ్లిగేషన్ తన స్నేహితుడు సునీల్. కమెడియన్ వేషాలు మళ్ళీ వేయడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి తన కెరీర్ ని మళ్ళీ మలుపు తిప్పే క్యారెక్టర్ ఇస్తాడని సునీల్ ఎదురు చూస్తున్నాడు.

కానీ త్రివిక్రమ్ అతనికి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలే ఇస్తున్నాడు. ఈసారి సినిమాలో మాత్రం పెద్ద క్యారెక్టర్ కావాలని సునీల్ తెగ మొహమాట పెట్టేస్తున్నాడట. త్రివిక్రమ్ కూడా అందుకు సరే అన్నాడట. మరి ఈ సినిమా అయినా సునీల్ ని తిరిగి స్టార్ కమెడియన్ గా నిలబెడుతుందో లేదో చుడాలిక.