సలార్ కాంబోలో దిల్ రాజు సినిమా ?

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబోలో భారీ ప్యాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న దిల్ రాజు ఇకపై కూడా ఇలాంటి గ్రాండ్ స్కేల్ ఎంటర్ టైనర్స్ కొనసాగించేలా కనిపిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కలయికలో రూపొందుతున్న సలార్ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రషెస్ చూసిన వాళ్ళు ఇది కెజిఎఫ్ కు పదింతలు ఉంటుందని తెగ ఊరించేస్తున్నారు. సెప్టెంబర్ రిలీజ్ కు ఆల్రెడీ ఫిక్స్ అయిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒకవేళ ఆది పురుష్ ప్లాన్ లో ఏదైనా మార్పు ఉంటే తప్ప చెప్పిన డేట్ కి ఖచ్చితంగా వచ్చేస్తుంది

ఎలాగూ ఫలితం మీద ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేయకూడదన్న ఆలోచనతో దిల్ రాజు ఈ ఇద్దరిని ఒక ప్రాజెక్టు కోసం లాక్ చేశారట. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ పలు సందర్భాల్లో ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఏదో ఒక రూపంలో ఇలాంటివి బయటికి వస్తున్నాయి. దాని ప్రకారం సోషియో ఫాంటసీ జానర్ లో మైథాలజీని టచ్ చేస్తూ ఓ కథ సబ్జెక్టుని సిద్ధం చేస్తున్నారట. అయితే ఇది అంత ఈజీగా పట్టాలు ఎక్కదు. సలార్ తర్వాత ప్రభాస్ మారుతీ సినిమా, ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా స్పిరిట్ పూర్తి చేయాలి. ఆలోగా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ 30 కంప్లీట్ చేసుకుని ఉండాలి.

ఇక్కడ చెప్పినంత తేలిగ్గా ఇవన్నీ జరగవు. సో ఒకవేళ నిజం కావాలన్నా 2024 తర్వాతే సాధ్యమవుతుంది కానీ అంతకన్నా త్వరగా అంటే డౌటే. దిల్ రాజు చాలా ప్లాన్డ్ గా సినిమాలు సెట్ చేస్తున్నారు. హోంబాలే, మైత్రి లాంటి బ్యానర్లు వందల కోట్ల పెట్టుబడులతో దూసుకుపోతుండటంతో తన ఎస్విసిని ఇంకాస్త బలంగా తీసుకెళ్ళాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఇవే కాదు ఇంద్రగంటి మోహనకృష్ణ, శైలేష్ కొలనులతో సైతం భారీ గ్రాండియర్లను ప్లాన్ చేస్తున్నారట. చిన్న సినిమాలకు గీతా ఆర్ట్స్ 2 లాగా ఇంకో కొత్త బ్యానర్ మొదలుపెట్టారు కాబట్టి భారీ చిత్రాలకు మాత్రం పెద్ద బ్యానర్ ని అంకితం చేసేసి దానిపై గ్రాండియర్లను మాత్రమే నిర్మించే ప్లానింగ్ కనిపిస్తోంది.