తెలుగులో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేశాడు వంశీ పైడిపల్లి. అతడి సినిమాలు రొటీన్‌గా ఉంటాయని.. సాగతీతగా అనిపిస్తాయని విమర్శలు ఉన్నప్పటికీ.. తన సక్సెస్ రేట్ అయితే బాగున్న మాట వాస్తవం. తొలి సినిమా ‘మున్నా’ను మినహాయిస్తే దాదాపుగా అన్నీ సక్సెస్‌లే ఇచ్చాడు వంశీ.
చివరగా మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన వంశీ.. తర్వాత మహేష్‌తోనే ఇంకో సినిమా చేయాల్సింది. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక ఆ సినిమా క్యాన్సిలైంది. మహేష్ కాదంటే ఇంకో తెలుగు స్టార్ దొరికేవాడేమో కానీ.. వంశీ మాత్రం తమిళ టాప్ స్టార్ విజయ్‌ను ఓ కథతో మెప్పించి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమాను పట్టాలెక్కించాడు. ఆ చిత్రమే.. వారిసు/వారసుడు. ఈ సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులు మొదట్నుంచి ఒక వ్యతిరేక భావంతో ఉన్నారు. ట్రైలర్ మరింతగా నెగెటివిటీని పెంచింది.
కానీ మన దగ్గర ఈ టైపు సినిమాలు చాలా వచ్చాయి కాబట్టి రొటీన్ అనిపించి ఉండొచ్చు కానీ.. తమిళ జనాలకు ఆ ఫీలింగ్ ఏమీ లేదు. సంక్రాంతి కానుకగా బుధవారం రిలీజైన ఈ చిత్రానికి తమిళంలో మంచి టాక్ కూడా వచ్చింది. విజయ్ ఇమేజ్‌ను వంశీ సరిగ్గా ఉపయోగించుకుని అభిమానులు ఆశించే అన్ని అంశాలనూ అందించడం అక్కడ ప్రశంసలు అందుకుంటోంది. విజయ్ ఫ్యాన్స్ అయితే వంశీని తెగ పొగిడేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లను మించి విజయ్‌ని సినిమాలో ఎలివేట్ చేశాడని.. అతడి ఇమేజ్, టైమింగ్‌ను సరిగ్గా ఉపయోగించుకున్నాడని వాళ్లంటున్నారు.
ముఖ్యంగా హీరో సీఈవో కావడానికి అతడి అన్న అడ్డు పడ్డ సమయంలో అటు వైపు ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తన వైపు తిప్పుకునే ఓ సీన్ వాళ్లకు తెగ నచ్చేస్తోంది. అందులో విజయ్ కెరీర్లో పెద్ద హిట్లుగా నిలిచిన కత్తి, బిగిల్, మాస్టర్ లాంటి చిత్రాలను రెఫరెన్సులను వాడుకున్న తీరు అభిమానులను ఫిదా చేసేసింది. చాలా ఎంటర్టైనింగ్‌గా సాగే ఈ ఎపిసోడ్‌కు తమిళనాట థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. నిజానికి ఈ ఎపిసోడ్ ‘అల వైకుంఠపురుములో’లో అంత్యాక్షరి సీన్‌కు కాపీ అని చెప్పొచ్చు. కానీ తమిళ జనాలకు ఇది కొత్తగా, అలాగే విజయ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఉండడం ప్లస్ అయింది. ఈ ఎపిసోడ్ అనే కాక విజయ్‌కి సినిమా అంతటా మంచి ఎలివేషన్లే ఇచ్చాడు వంశీ.
This post was last modified on January 13, 2023 9:00 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…