గత ఏడాది వేసవిలో ‘ఆచార్య’, దసరాకి ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో పలకరించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు సంక్రాంతికి ఆయన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదలవుతోంది. నెక్స్ట్ బిగ్ సీజన్ అయిన వేసవికి కూడా ఆయన సినిమా వస్తుందని అనుకున్నారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు చిన్న షాక్ ఇచ్చాడు చిరు. ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావట్లేదని ఆయన తేల్చేశాడు.
ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ 30 శాతమే పూర్తయిందని.. ఈ నెల 17 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని అప్‌డేట్ ఇచ్చిన చిరు.. కుదిరితే మేలో ‘భోళా శంకర్’ను ప్రేక్షకుల ముందుకు తెస్తారని వెల్లడించాడు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే దసరా రిలీజ్ మీద దృష్టిసారిస్తామని చిరు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.
ఏప్రిల్ 14కు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’తో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికి తోడు చిరు సినిమా కూడా వస్తుందని అనుకున్నారు కానీ.. ఇప్పుడది వాయిదా పడిపోయింది. ఇంకా 30 శాతం షూటింగే పూర్తయిన నేపథ్యంలో చిరు అన్నట్లు మేలో రావడం కూడా సందేహమే.
దసరా రిలీజ్‌కు ఫిక్సయిపోవచ్చు. చిరు ఈ మధ్య చేసిన సినిమాల్లో అతి తక్కువ అంచనాలున్నది ‘భోళా శంకర్’ మీదే. తమిళంలో ఎప్పుడో వచ్చిన రొటీన్ మాస్ మూవీ ‘వేదాళం’కు రీమేక్ కావడం.. మెహర్ రమేష్ లాంటి లైమ్ లైట్లో లేని డైరెక్టర్ దీన్ని తెరకెక్కిస్తుండడంతో దీనిపై చిరు అభిమానుల్లోనే పెద్దగా ఆశలు, అంచనాలు లేవు.
సిస్టర్ సెంటిమెంట్ కథతో తెరకెెక్కుతున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్, ఆయనకు జోడీగా తమన్నా భాటియా నటిస్తున్నారు. అనిల్ సుంకర, కేఎస్ రామారావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on January 12, 2023 10:07 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…