చిన్న సినిమాలకు స్టార్ట్స్ వచ్చి ప్రమోషన్ చేస్తే అన్నో ఇన్నో టికెట్లు తెగి సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న హీరోలు ఎప్పటికప్పుడు తమ సినిమాకి స్టార్స్ సపోర్ట్ కోరుకుంటారు. ఇక సంక్రాంతి సీజన్ లో అయితే ఏ చిన్న సినిమాకైనా పెద్ద సపోర్ట్ ఉండాల్సిందే. మరో నాలుగు రోజుల్లో బడా సినిమాల మధ్య థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’ కి కూడా తాజాగా ప్రభాస్ సపోర్ట్ దక్కింది. తనకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శోభన్ తనయుడు, పైగా యూవీ నిర్మించిన సినిమా కావడంతో ప్రభాస్ సపోర్ట్ ఈ చిన్న సినిమాకు గట్టిగా ఉంటుందని అందరూ భావించారు.
కానీ ప్రభాస్ తో టీం వెడ్డింగ్ సాంగ్ మాత్రమే లాంచ్ చేయించుకొని ఊహించని విధంగా వాడుకున్నారు. అది కూడా డిజిటల్ రిలీజ్ మాత్రమే. ఇలా కాకుండా టీంతో ప్రభాస్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. గతంలో పూరీ జగన్నాథ్ కోసం ఆకాష్ ను, హీరోయిన్ ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి ఆ సినిమాకి సోషల్ మీడియాలో కావలసినంత ప్రమోషన్ చేసి పెట్టాడు. ఆ స్టైల్ లో సంతోష్ శోభన్ తో కూడా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ చేస్తే సంక్రాంతి సినిమాకి కలిసొచ్చేది. ఈ సినిమాకి కొంత బజ్ వచ్చేది.
కనీసం ప్రభాస్ ను గెస్ట్ గా పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ప్లాన్ చేసుకోవాల్సింది. మొన్న అనుష్క తో ట్రైలర్ లాంచ్ చేయించి ఇప్పుడు ప్రభాస్ తో జస్ట్ ఓ సాంగ్ లాంచ్ చేయించుకోవడం యూవీ రాంగ్ స్ట్రాటజీనే. ఏదేమైనా బడా సినిమాల మధ్య తమకి కూడా ఎంతో కొంత కలెక్షన్స్ వస్తే చాలులే అనుకుంటున్నట్టున్నారు యూవీ నిర్మాతలు. లేదంటే ప్రమోషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే ఐడియాలు రావాంటారా?
This post was last modified on January 11, 2023 9:17 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…