కరోనా కారణంగా 2020 తర్వాత గత రెండు సంక్రాంతులు కళ తప్పాయి. 2021లో సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడవగా.. ఆ ఏడాది మరీ భారీ చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు సంక్రాంతికి రావాల్సింది కానీ.. కొన్ని రోజుల ముందే కరోనా మూడో వేవ్ తాకిడి పెరగడంతో ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కానీ 2023 సంక్రాంతి మాత్రం ప్రేక్షకులను నిరాశ పరచట్లేదు. ఎప్పట్లా రెండు భారీ చిత్రాలు సంక్రాంతికి షెడ్యూల్ అయ్యాయి. అవి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల సినిమాలు కావడంతో బాక్సాఫీస్ ఒక్కసారిగా వేడెక్కిపోతోంది. సంక్రాంతికి ఇలా రెండు పెద్ద సినిమాలు రిలీజైనా.. వాటితో పాటు ఒకట్రెండు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు రావడం మామూలే. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు పరిస్థితి.
కానీ చిరు, బాలయ్యల సినిమాలకున్న హైప్ చూస్తుంటే.. వాటి ముందు మిగతా సినిమాలు అస్సలు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. మిగతా మూడు చిత్రాల్లో బజ్ తక్కువున్నది అంటే.. అనువాద చిత్రం ‘తెగింపు’నే. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తెలుగులో అసలు ప్రమోషన్ అన్నదే లేదు. కాకపోతే ఆ చిత్రానికి 11న సోలో రిలీజ్ ఛాన్స్ దక్కింది. ఆ ఒక్క రోజు ఓ మోస్తరుగా వసూళ్లను రాబట్టుకునే ఛాన్సుంది. కానీ తర్వాతి రోజు నుంచి ఆ చిత్రానికి థియేటర్లు మిగలవు.
12, 13 తారీఖుల్లో చిరు, బాలయ్యల సినిమాలు వస్తున్నాయి. ఆ రెండు రోజుల వాటికి మాగ్జిమం థియేటర్లు ఇచ్చేస్తున్నారు. ఈ రెండు సినిమాల ట్రైలర్లూ మాస్‌కు విందు భోజనంలా అనిపించాయి. అభిమానులకు కూడా పండుగ గ్యారెంటీ అనిపిస్తోంది. ఇవి థియేటర్లలోకి దిగాక వేరే సినిమా వైపు ప్రేక్షకులు చూడడం కష్టమే. రెండు సినిమాలకు మించి పండక్కి డబ్బులు పెట్టడానికి కూడా జనాలు ఇష్టపడరు. ఈ రెండూ మినిమం గ్యారెంటీ సినిమాల్లా అనిపిస్తున్నాయి. కాబట్టి టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాలకు జనాలు వెళ్లిపోవడం పక్కా. ఇవి అందుబాటులో ఉండగా.. డబ్బింగ్ మూవీ ‘వారసుడు’ను, సంక్రాంతి బరిలో ఉన్న చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’ను జనాలు పట్టించుకుంటారా అన్నది సందేహమే. టాక్ ఓ మోస్తరుగా ఉన్నా చాలు.. చిరు, బాలయ్యల సినిమాలు మిగతా వాటిని తొక్కుకుంటూ వెళ్లిపోవడం గ్యారెంటీ.
This post was last modified on January 10, 2023 5:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…