మూడేళ్ళ క్రితం వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ సూపర్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించిన నభ నటేష్ కు మంచి పేరే వచ్చింది. పూరి జగన్నాధ్ స్టైల్ లో రూపొందిన మాస్ టచ్ ఉన్న బ్యూటీగా యూత్ లో ఫాలోయింగ్ పెంచింది. అందులో నటించిన నిధి అగర్వాల్ ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లులో ఛాన్స్ కొట్టేస్తే ఈ నభా మాత్రం కనిపించకుండా పోయింది. మధ్యలో చేసిన రవితేజ డిస్కో రాజా డిజాస్టర్ కాగా సాయి ధరమ్ తేజ్ తో నటించిన సోలో బ్రతుకే సో బెటరూ డీసెంట్ రన్ అనిపించుకుంది. ఆ టైంలో అవకాశాలు బాగానే వచ్చాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ మరీ అన్యాయంగా ఫ్లాప్ కాగా నితిన్ తో జట్టు కట్టిన మాస్ట్రో ఓటిటి రిలీజ్ కావడంతో పెద్దగా ప్రయోజనం కలగలేదు. అటుపై ఈ కన్నడ భామ ఉనికి లేదు. తాజాగా ట్విట్టర్ లో ఇచ్చిన షాక్ తో తనకేమైందో వివరించింది. దాని ప్రకారం 2022లో నభ నటేష్ కు పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఎడమ భుజం దగ్గర ఎముకలు విరగడంతో పాటు పదే పదే కొన్ని క్లిష్టమైన సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో మానసికంగా శారీరకంగా చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి సినిమాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తరచూ ఇలాంటి పరిస్థితులకు లోను కావాల్సి వస్తోంది. సమంతా వ్యాధితో పోరాడి నెలల తర్వాత నిన్న మీడియా ఫ్యాన్స్ ని ఎంతగా కదిలించిందో చూశాం. హంసా నందిని క్యాన్సర్ బారిన పడి క్రమంగా కోలుకుంటోంది. ఇప్పుడు నభ నటేష్ ఇలా ఆసుపత్రిలో ఎక్కువ కాలం గడపాల్సి రావడం బాధాకరం. క్షేమంగా బయటికి రావడం కన్నా కావాల్సింది ఏముంటుంది కానీ తెరమీద చూపించాల్సిన స్థైర్యం నిజ జీవితంలోనే ప్రదర్శించాల్సి రావడం అరుదుగా జరుగుతుంది. ఆ మధ్య సుప్రీమ్ హీరో సైతం మృత్యుముఖం దాక వెళ్లి దాన్ని ఓడించి మరీ త్వరలో విరూపాక్షగా రాబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 10, 2023 3:47 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…