Movie News

షారుఖ్ మీదున్న అభిమానం రాజుగారి మీద లేదే

విజయ్ లాంటి స్టార్ హీరో కదలిక అది ఆన్ లైన్ అయినా సరే దాని మీద అభిమానులకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఒక టాలీవుడ్ నిర్మాత దర్శకుడు కలిసి తనతో అంత భారీ బడ్జెట్ తో వారసుడు నిర్మిస్తే ఇక్కడి ఫ్యాన్స్ కోసం కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చేంత తీరికలో లేడనే గుసగుసలు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. నిన్న ప్రెస్ మీట్ లో దీని గురించి అడిగితే దిల్ రాజు మాట్లాడుతూ ఆయన ఇంటర్వ్యూ లేదా ఒక వేడుక ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఇస్తారని దాన్నే వాడుకోవాలని సెలవిచ్చారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ వారసుడు తెలుగు ట్రైలర్ ఇప్పటిదాకా విజయ్ తన ట్విట్టర్ లో షేర్ చేయకపోవడం గమనార్హం.

సరే ఎందుకోలే అనుకుంటే తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ ట్రైలర్ ని ట్వీట్ చేసి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మాములుగా ఒక బాలీవుడ్ మూవీని ఇలా తమిళ తారలు పాజిటివ్ గా షేర్ చేయడం అరుదు. అందులోనూ విజయ్. అయితే దీని వెనుకో కారణం ఉంది. షారుఖ్ తర్వాతి సినిమా జవాన్ లో విజయ్ క్యామియో చేశాడు. దాని షూటింగ్ కూడా పూర్తయ్యింది. తనతో వరసగా మూడు సూపర్ హిట్లు తీసిన ఆట్లీ దర్శకుడు కావడంతో ఆలోచించకుండా ఓకే చెప్పాడు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వచ్చే వేసవిలోనే విడుదలకు రెడీ అవుతోంది.

ఒక చిన్న పాత్ర చేసినందుకే ఇంత అభిమానం చూపిస్తే మరి కోట్లు ఖర్చు పెట్టి తీసిన ప్రొడ్యూసర్ కోసం కనీసం డబ్బింగ్ ట్రైలర్ ని షేర్ చేయడమో లేదా హైదరాబాద్ కు వచ్చి కాసిన్ని మాటలు మీడియాతోనో జనాలతోనో పంచుకుంటేనో బాగుంటుంది. పైగా అంత మార్కెట్ లేకపోయినా తన నెట్ వర్క్ తో ఇంత పెద్ద రిలీజ్ ఇస్తున్న దిల్ రాజు కోసమైనా ఇవన్నీ చేయొచ్చుగా. మొత్తానికి తెలుగు ప్రమోషన్ల విషయంలో విజయ్ తన చిన్న చూపుని ఇప్పటికైతే కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకవేళ రాజుగారు ఏదైనా మేజిక్ చేసి ఈ రెండు మూడు రోజుల్లో తీసుకొస్తారో లేదా ఇక సెలవు ఇంతే సంగతులు అంటారో చూడాలి.

This post was last modified on January 10, 2023 12:04 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

21 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

29 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

44 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

45 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago