సినిమాల రేటింగ్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఫాలో అయ్యే ఐఎండిబి ప్రామాణికత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య స్టాండర్డ్స్ కి సంబంధించి కొన్ని అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ బ్రాండ్ కు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ 2022 టాప్ 10 ఇండియన్ యాక్టర్స్ ని ప్రకటించినప్పుడు దాని ప్రాధాన్యత క్రమంలో అర్హత లేని ఒకరిద్దరికి చోటు దక్కడం గురించి విమర్శలైతే వచ్చాయి. తాజాగా ఈ ఏడాది అత్యధికంగా ఇండియన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టాప్ 20 సినిమాల జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలున్నాయి.
మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ పఠాన్ ఉంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న బాద్షా మూవీ కావడంతో ఆ మాత్రం గౌరవం దక్కడం సముచితమే. రెండో ప్లేస్ లో పుష్ప ది రూల్ పార్ట్ 2 ఉంది. ఒక డబ్బింగ్ మూవీకి ఈ స్థాయిలో నార్త్ క్రేజ్ ఉండటం చాలా అరుదు. తర్వాత వరసగా మూడు నుంచి పది ర్యాంకుల్లో జవాన్, ఆది పురుష్, సలార్, వారసుడు, కబ్జా, విజయ్ 67, ది ఆర్చీస్, డుంకీ ఉన్నాయి. వీటిలో రెండు డార్లింగ్ ప్రభాస్ వి ఉండటం గమనార్హం. తర్వాత టైగర్ 3, కిసీకా భాయ్ కిసీకా జాన్, తెగింపు, యానిమల్, ఏజెంట్, ఇండియన్ 2, వడివాసల్, షెహజాదా, బడే మియా చోటే మియా 2, భోళా ఉన్నాయి.
ట్విస్ట్ ఏంటంటే ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు రామ్ చరణ్ 15, ఎన్టీఆర్ 30 ఈ లిస్టులో లేవు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకూ చోటు దక్కలేదు. అఖిల్ ఉండటం చూస్తే ఏజెంట్ మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాను రాను ఐఎండిబిల సమాచారం పూర్తి స్థాయి స్టాండర్డ్ లో ఉన్నట్టు అనిపించడం లేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం హీరోల క్రేజ్ ను చూసి ఇలా పెడుతున్నారు తప్పించి నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ప్రేక్షకుల అంచనాలు విశ్లేషణలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. సరే ఐఎండిబి అంటే అదో బ్రాండ్ కాబట్టి ప్రస్తుతానికి ఇలా చెల్లిపోతోంది.
This post was last modified on January 9, 2023 5:22 pm
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…
ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…