దర్శకుడి మాటలకి సమంత కన్నీరు

సమంత అప్ కమింగ్ హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత తళుక్కున మెరిసింది. యశోద రిలీజ్ తర్వాత కొన్ని నెలలుగా సమంత ఎక్కడికి వెళ్ళింది ? ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకుంటుంది ? అనే విషయాలు బయటికి రాలేదు. తాజాగా ఆమె ముంబై లో సడెన్ గా ప్రత్యక్షమయింది. తాజాగా శాకుంతలం ఈవెంట్ లో కనిపించింది.

అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ లో దర్శకుడు గుణ శేఖర్ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనకి దిల్ రాజు ఎలాంటి సపోర్ట్ అందించాడనే విషయం చెప్తూ ఆయన కాసేపు మీడియా ముందే ఏడ్చేశారు. గుణ శేఖర్ కన్నీరు పెట్టుకుంటుంటే ఆయనతో పాటు సమంత కూడా అనుకోకుండా కళ్ళ నీళ్ళతో కనిపించింది. పక్కనే ఉన్న దిల్ రాజుతో ఆయన చెప్తుంటే నేను ఎమోషనల్ అవుతున్నా అంటూ చెప్తూ ఏడ్చేసింది.

తన స్పీచ్ లో సమంత కాస్త ఎమోషనల్ అయింది. కాకపోతే కన్నీరు రాకుండా కంట్రోల్ చేసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాను తను ప్రేమించే విధానం , తనని సినిమా ప్రేమించే విధానం ఏ మాత్రం మారలేదని చెప్పుకుంది. శాకుంతలంతో ఆ ప్రేమ ఇంకా పెరగనుందని తెలిపింది. యశోద ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఏడ్చిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో సమంత ఎమోషనల్ వీడియో ఆమె అభిమానుల్ని మరింత బాధకి గురి చేస్తుంది.