Movie News

చిరు నోటితో కాపీ డైలాగ్ చెప్పించారేంటి?

సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీర‌య్య నుంచి రెండు రోజుల కింద‌టే ట్రైల‌ర్ వ‌చ్చింది. అందులో చిరంజీవి ఊర మాస్ అవ‌తారం.. ఆయ‌న మేన‌రిజ‌మ్స్‌.. డైలాగ్స్ అన్నీ కూడా అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. వింటేజ్ చిరును గుర్తుకు తెచ్చాయి. ముఖ్యంగా ఇందులో కొన్ని పంచ్ డైలాగులు భ‌లేగా పేలాయి.

అందులో ఒక‌టి.. నేను రికార్డుల్లో ఉండ‌డం కాదు.. రికార్డులే నా పేరు మీద ఉంటాయి అనే డైలాగ్. చిరంజీవి చూడ‌ని రికార్డుల్లేవు కాబ‌ట్టి అభిమానులు ఈ డైలాగ్‌తో బాగా క‌నెక్ట‌య్యారు. ఐతే ఈ డైలాగ్ కొత్త‌ది కాక‌పోవ‌డం, ఆల్రెడీ ఒక సినిమాలో ఉన్న‌దే కావ‌డం విశేషం. మెగాస్టార్ మేన‌ల్లుడైన సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా నటించిన విన్న‌ర్ సినిమాలో సేమ్ డైలాగ్ ఉండ‌డం గ‌మనార్హం.

2017లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కిన విన్నర్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లో నటించాడు క‌మెడియ‌న్ పృథ్వీ. అందులో ఆయ‌న పాత్ర పేరు.. సింగం సుజాత. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు సింగం సుజాత ఓ డైలాగ్ చెబుతాడ‌ ” రికార్డ్స్ లో నా పేరు ఉండడమేంట్రా.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత.. సింగం సుజాత” అంటూ ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటూనే సెటైరిక‌ల్‌గా ఈ డైలాగ్ రాశారు.

ఈ డైలాగ్‌నే యాజిటీజ్ వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో చిరంజీవి చెప్పడం చూసి అంద‌రూ షాక‌వుతున్నారు. రెండు వీడియోల‌ను ప‌క్క ప‌క్క‌న పెట్టి.. ఇంత గుడ్డిగా డైలాగ్ కాపీ కొట్టేశారేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు నెటిజ‌న్లు. ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో దీనికి స‌మాంత‌రంగా తెర‌కెక్కిన వీర‌సింహారెడ్డి చిత్రాన్ని రూపొందించింది విన్న‌ర్ ద‌ర్శ‌కుడే కావ‌డం విశేషం. అయినా అత‌డి సినిమాలో ఈ డైలాగ్ ఉన్న సంగతి ఎవ‌రూ గుర్తించ‌క‌పోవ‌డ‌మేంటో?

This post was last modified on January 9, 2023 9:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

18 minutes ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

34 minutes ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

4 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

12 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

13 hours ago