ఏపీ గవర్మెంట్ పై బాలయ్య డైరెక్ట్ పంచ్

బాలయ్య సంక్రాంతి సినిమా ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అందరూ ఎదురుచూసిన ఈ ట్రైలర్ పవర్ ఫుల్ డైలాగ్స్ మెప్పించి మంచి మార్కులే స్కోర్ చేసింది. బాలయ్య నుండి ఫ్యాన్స్ , సినీ అభిమానులు ఏం ఊహించి థియేటర్స్ కి వెళ్తారో అవన్నీ పక్కగా ప్లాన్ చేసుకున్నాడు గోపీచంద్ మాలినేని. ట్రైలర్ చూస్తే కథ రొటీన్ అయినా సంక్రాంతి సీజన్ లో కాసులు తెచ్చే కళ కనిపిస్తుంది.

ఇక ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ లో బాలయ్య ఏపీ సర్కారు పై , ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై పరోక్షంగా వేసిన పంచ్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మధ్య జగన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఉన్నట్టుండి పేరు మార్చి మాజీ ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం దానికి టీడీపీ కౌంటర్ ఇవ్వడం దర్నాలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ లో బాలయ్య “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో , కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారాదు ,మార్చలేరు.” అనే డైలాగ్ తో పరోక్షంగానే పంచ్ వేశాడు , అలాగే ట్రైలర్ చివర్లో “పదవి చూసుకొని మీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరెక్కువ” అంటూ నేరుగా తన పొగరు గురించి చెప్పి ట్రైలర్ ని పవర్ ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేశాడు.

మరి ‘వీరసింహా రెడ్డి’ లో బాలయ్యే ఈ డైలాగులు పెట్టించుకున్నాడా ? లేదా దర్శకుడు గోపీచంద్ మాలినేని , రైటర్ సాయి మాధవ బుర్రా ఫ్యాన్స్ కోసం బాలయ్యతో ఈ డైలాగులు చెప్పించారా ? ఏదేమైనా బాలయ్య పంచ్ డైలాగులు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.