అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న వీరసింహారెడ్డి భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలతో పోటీ పడుతున్నప్పటికీ అంచనాల పరంగా ఎక్కువ హైప్ తో ఆ ట్రెండ్ ని అడ్వాన్స్ బుకింగ్స్ లోనే చూపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక విషయంలో తొలుత కొంత అయోమయం రేగినా ఫైనల్ గా ఒంగోలు వేదికగా అంగరంగ వైభవంగా సంబరం జరుపుకుంది. ఈ సందర్భంగానే ట్రైలర్ లాంచ్ కూడా జరిగిపోయింది. పోస్టర్లు లిరికల్ వీడియోలు తప్ప సినిమాలో కంటెంట్ ఏముందో ఇప్పటిదాకా పెద్దగా లీక్స్ రాలేదు.
వీడియోలో గుట్టు దాచకుండా కథను ఒక అవగాహన వచ్చేలా చెప్పేశారు. పులిచర్లలో పుట్టి అనంతపురంలో చదివి కర్నూలులో స్థిరపడిన వీరసింహారెడ్డి(బాలకృష్ణ)ది ఎవరూ కత్తి పట్టకూడదనే సిద్ధాంతంతో తాను మాత్రమే వేటకు బలికి సిద్ధపడతాడు. కానీ శత్రువుల(దునియా విజయ్) నుంచి తన వాళ్ళను కాపాడుకోవడం కోసం ఎంతటి రక్తపాతానికైనా సిద్ధపడే మనస్తత్వం అతనిది. అలాంటి శక్తివంతుడు విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తనలాంటి పోలికలే ఉన్న మరొకరు(బాలకృష్ణ), మాంగల్యం ఉన్న విధవలా బ్రతికే ఆడ ప్రత్యర్థి(వరలక్ష్మి శరత్ కుమార్) ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే తెరమీద చూడమంటున్నారు.
ఆశించినట్టే బాలకృష్ణ విశ్వరూపం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా వీరసింహారెడ్డిగా పెద్ద గెటప్ లో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనిపించేలా ఉంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి తగిన సెటప్ తో పాటు క్యాస్టింగ్, టేకింగ్ విషయంలో దర్శకుడు గోపీచంద్ మలినేని తీసుకున్న శ్రద్ధ కనిపిస్తోంది. నీ పొగరు పవర్ లో ఉందేమో నాకు బై బర్త్ డిఎన్ఏ లో ఉందంటూ చెప్పిన సంభాషణలు మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మరీ కనివిని ఎరుగని స్టోరీగా అనిపించకపోయినా ఎలివేషన్లను ఓ రేంజ్ లో పండించిన బాలయ్య గోపీచంద్ కాంబో తమన్ సంగీతం సాయిమాధవ్ బుర్రా మాటలు ఇతర సాంకేతిక బృందంతో ఫుల్ మీల్స్ పెట్టేలాగే ఉంది.
This post was last modified on January 6, 2023 8:59 pm
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…