‘బాహుబలి’తో ప్రభాస్ తెచ్చుకున్న ఫాలోయింగ్, మార్కెట్, క్రేజ్ అసాధారణమైనవి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక సినిమాతో ఈ స్థాయిలో ఎదిగిపోయిన హీరో ఎవ్వరూ కనిపించరు. ఐతే ఇదంతా బలుపా వాపా అనిపించేలా ప్రభాస్ తర్వాతి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘సాహో’కు ఓపెనింగ్స్ అయినా భారీగా వచ్చాయి కానీ.. ‘రాధేశ్యామ్’కు అది కూడా లేకపోయింది. దీంతో ప్రభాస్ గురించి కొంతమంది తేలిక చేసి మాట్లాడారు.
‘ఆదిపురుష్’ తాలూకు నెగెటివిటీ కూడా తోడై ప్రభాస్ ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. కానీ ఇప్పుడు కూడా సరైన సినిమా పడితే ప్రభాస్ సత్తా ఏంటో బాక్సాఫీస్ రుచి చూస్తుందనే అంచనాతో ఉన్నారు అభిమానులు. సలార్, ప్రాజెక్ట్-కే సినిమాల మీద నెలకొన్న అంచనాలు, వాటికి వస్తున్న బిజినెస్ ఆఫర్లు ప్రభాస్ స్టామినా ఏమి తగ్గిపోలేదనే సంకేతాలు ఇస్తున్నాయి.
‘ప్రాజెక్ట్-కే’కు సంబంధించి తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఒక వార్త.. ప్రభాస్ సత్తాకు నిదర్శనం. ఈ చిత్ర నైజాం హక్కులను చాలా ముందుగానే ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ కొనేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ.. ఇంతలోనే ఫ్యాన్సీ రేటు ఇచ్చి నైజాం ఏరియా హక్కులను కొనేశాడట సునీల్. ఆ రేటు రూ.70 కోట్లని అంటున్నారు.
ఇప్పటిదాకా నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక బిజినెస్ చేసింది. ఆ సినిమా కూడా రూ.70 కోట్లే పలికింది. రాజమౌళి సినిమా కాకపోయినా ‘ప్రాజెక్ట్-కే’ ఆ రికార్డును సమం చేసింది. ఇది ప్యూర్ ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అంటున్నారు. ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. తన అల్లుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫాంటసీ టచ్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on January 4, 2023 9:32 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…