ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు పర్మిషన్ల గండం ?

సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వీటికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే అన్ని సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం నుండి రెండు ఈవెంట్స్ కి పర్మిషన్ ప్రాబ్లం గండం వచ్చి పడిందట.

బాలయ్య వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు. పర్మిషన్ అప్లై చేసి అక్కడ వర్క్ మొదలు పెట్టేశారు కూడా. ఇక వాల్తేరు వీరయ్య కోసం వైజాగ్ బీచ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా ఏర్పాట్లు మొదలు పెట్టారు. కానీ అనుకోకుండా రెండు ఈవెంట్స్ కి పర్మిషన్ సమస్య ఎదురైందని ఇన్సైడ్ టాక్. వీర సింహా రెడ్డి ఈవెంట్ కి వచ్చే భారీ పబ్లిక్ ఒంగోల్ గ్రౌండ్ లో ఆపలేమని, అంత మందిని గ్రౌండ్ లో పెట్టి ఈవెంట్ చేయడం ఇంపాజిబుల్ అని పోలీస్ లు పర్మిషన్ కి నిరాకరించారని తెలుస్తుంది.

ఇక వాల్తేరు వీరయ్య ఈవెంట్ కోసం వైజాగ్ బీచ్ ప్లేస్ కి పర్మిషన్ ఇచ్చేందుకు అక్కడ పోలీస్ శాఖ నిరాకరించిందని సమాచారం. దీంతో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ కి, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదారాబాద్ కి షిఫ్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.