క్రిస్మస్ వీకెండ్లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా ‘ధమాకా’. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం డివైడ్ టాక్, మిక్స్‌డ్ రివ్యూస్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. ట్రేడ్ పండిట్లు కూడా ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకునేలా కనిపిస్తోంది. వీకెండ్ అవ్వగానే ఈ చిత్ర బృందం.. సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో ఒక వివాదం చోటు చేసుకుంది.
ఏ స్టేజ్ ఎక్కినా అక్కడున్న హీరోను ఆకాశానికి ఎత్తేయడం అలవాటైన బండ్ల గణేష్.. ఈ వేడుకలో రవితేజకు కూడా ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు. రవితేజను పొగిడే క్రమంలో.. ఈ మధ్య కొంతమంది నటుడు రెండు మూడేళ్లకే సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయిపోతున్నారని, రవితేజ అలా కాకుండా కష్టపడి పైకి వచ్చాడని వ్యాఖ్యానించాడు.
ఐతే బండ్ల గణేష్ సూపర్ స్టార్, మెగాస్టార్ అనే పదాలు వాడడం కొందరికి నచ్చలేదు. కమెడియన్ షకలక శంకర్ కూడా ఈ వ్యాఖ్యల మీద అభ్యంతరం వ్యక్తం చేశఆడు. మెగాస్టార్, సూపర్ స్టార్ ఊరికే అయిపోరని.. కష్టపడితేనే అవుతారని.. ఎవడో హీరో నీ ముందుంటే నువ్వు వెనుకా ముందు చూసుకోకుండా మైక్ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఐతే శంకర్ ఫ్లోలో ‘‘ఎవడో హీరో నీ ముందు ఉంటే..’’ అంటూ పరోక్షంగా రవితేజను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడాడని మాస్ రాజా అభిమానులకు కోపం వచ్చింది. అతను రవితేజకు సారీ చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. శంకర్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో షకలక శంకర దిగిరాక తప్పలేదు. తాను చిరంజీవిని ఎంత అభిమానిస్తానో, రవితేజను కూడా అంతే అభిమానిస్తానని.. ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించాలని అతను వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ శాంతించారు.
This post was last modified on January 3, 2023 7:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…