ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలతో కలిపి ఇప్పటికే ఆరు సినిమాలు ఎనౌన్స్ చేశారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ లతో పాటు సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ , రాహుల్ విజయ్ ‘వివాహం’ అనే చిన్న సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో నిలిచాయి.
‘వాల్తేరు వీరయ్య’ , ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకు సంబందించి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. వీటి మధ్య చిన్న సినిమాలు ఆనడం లేదు. ‘కళ్యాణం కమనీయం’ ప్రమోషన్ మొదలు పెట్టి వారం దాటింది. ఇంత వరకు సినిమాపై బజ్ తీసుకురాలేకపోయారు మేకర్స్. ఇక 2023 సంక్రాంతి రేస్ లో ‘వివాహం’ సినిమా ఉందనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియని పరిస్థితి.
తాజాగా సమాచారం మేరకు రాహుల్ విజయ్ ,శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ‘వివాహం’ సంక్రాంతి నుండి తప్పుకుందట. అసలే నాలుగు బడా సినిమాలు, మధ్యలో యూవీ నిర్మించిన మీడియం రేంజ్ సినిమా కూడా ఉండటంతో ఈ చిన్న సినిమాకి ఓ మోస్తరు థియేటర్స్ కూడా దొరకడం లేదట. అందుకే సైలెంట్ గా నిర్మాతలు తమ సినిమాను జనవరి 26కి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. మరో రెండ్రోజుల్లో సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్టు కొత్త రిలీజ్ డేట్ తో ప్రకటించే అవకాశం ఉంది.
ఏదేమైనా సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ సినిమాకి కొంతలో కొంత ప్రమోషన్ లభించింది. మరి జనవరి 26 న కూడా తెలుగులో గట్టి పోటీ ఉండబోతుంది. జనవరి 25న షారుక్ ఖాన్ పఠాన్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక 26 న సుధీర్ బాబు హంట్ , సితార సంస్థ ‘బుట్ట బొమ్మ’ రిలీజ్ అవ్వబోతున్నాయి. సో వివాహం ఎప్పుడొచ్చినా కాంపిటీషన్ తప్పని పరిస్థితి.
This post was last modified on January 3, 2023 3:06 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…