Movie News

వారసుడు వేడుక కోసం మల్లగుల్లాలు

సంక్రాంతి పందెంలో థియేటర్ల విషయంలో సెంటర్ అఫ్ కాంట్రావర్సీగా నిలుస్తున్న వారసుడుకి ఇప్పటిదాకా తెలుగులో ఏమంత బజ్ లేదు. నిర్మాత దిల్ రాజు మంచి స్క్రీన్లను లాక్ చేస్తూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల మీద వివక్ష చూపిస్తున్నారనే కామెంట్లు ఎక్కువైపోతున్న నేపథ్యంలో తమది డబ్బింగ్ సినిమా అయినా హైప్ పెంచాల్సిన బాధ్యత ఎస్విసి టీమ్ మీద ఉంది. దానికి రెండే ఆయుధాలు. ఒకటి ట్రైలర్. రెండోది ప్రీ రిలీజ్ ఈవెంట్. చెన్నైలో ఆ మధ్య ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంచనాలు పెంచడంలో అక్కడది బాగానే ఉపయోగపడింది.

కానీ విజయ్ కు తెలుగులో అంత మార్కెట్ లేదు. తుపాకీ నుంచి బీస్ట్ దాకా హిట్లు ఫ్లాపులు ఎన్ని ఉన్నా మరీ చిరంజీవి బాలకృష్ణలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేంత సీన్ ఎంత మాత్రం లేదు. పైగా వారసుడు స్టోరీ లైన్ మనమెన్నో సార్లు చూసిన టైపులోనే ఉంటుందని ఆల్రెడీ చెన్నై లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా చేస్తే మీడియాతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ దీని మీద చర్చ మొదలవుతుందని అంచనా. అయితే విజయ్ ఇప్పటిదాకా డబ్బింగ్ ప్రమోషన్ల కోసం ఏనాడూ హైదరాబాద్ రాలేదు. కానీ వారసుడు స్పెషల్ కేస్ కాబట్టి ప్రత్యేకంగా పరిగణిస్తాడు. తప్పదు.

వేదిక ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఎలా సమీకరించాలి. అతిథులుగా ఎవరైనా పిలవాలా వద్దా అనే అంశాల మీద దిల్ టీమ్ డిస్కషన్లో ఉంది. ఆల్రెడీ వీరసింహారెడ్డి వేడుక జనవరి 6న ఒంగోలులో, వాల్తేరు వీరయ్య ఈవెంట్ 9న విశాఖపట్నంలో ఫిక్స్ చేశారు. అజిత్ తెగింపుకి ఏదో చిన్నగా లాగించేస్తారు కానీ వారసుడుకి మాత్రం అల్లాటప్పాగా చేస్తే కుదరదు. విజయ్ రావడం పక్కానే కానీ ఏం మాట్లాడతాడు, పబ్లిక్ కి ఏం సందేశం ఇస్తాడు, వీరయ్య వీరసింహాల ప్రస్తావన తెస్తాడా లాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఇక్కడ పరిస్థితి గురించి పోటీ గురించి తనకు అవగాహన ఉందో లేదో ?

This post was last modified on January 3, 2023 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…

3 hours ago

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

8 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

12 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

13 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

14 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

15 hours ago