Movie News

పవన్ ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే కష్టమే..

టాలీవుడ్లో క్రేజ్ అనే మాట ప్రస్తావనకు వస్తే గుర్తుకొచ్చే పేరు పవన్ కళ్యాణ్‌దే. చిరంజీవి 90ల్లో అనుభవించిన దానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఆయన తమ్ముడు స్టార్‌డమ్ సంపాదించాడు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి.. ఇలా కెరీర్ తొలి పదేళ్లలోనే బ్లాక్ బస్టర్లు అందుకుని తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. అవేవీ పవన్ క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను తగ్గించలేకపోయాయి.

పవన్ సినిమా రిలీజైతే కనిపించే యుఫోరియాను మ్యాచ్ చేయడం కష్టం అనిపిస్తుంది. ‘జల్సా’ అనే పవన్ యావరేజ్ మూవీని గత ఏడాది ఆయన పుట్టిన రోజుకు రీరిలీజ్ చేస్తే థియేటర్లు షేక్ షేక్ అయిపోయాయి. అప్పటికే ‘పోకిరి’ సినిమా రీ రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానులు షోలు, కలెక్షన్ల పరంగా నెలకొల్పిన రికార్డులన్నింటినీ పవన్ ఫ్యాన్స్ బద్దలు కొట్టేశారు. ఇక థియేటర్లలో వారి సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ తర్వాత రీరిలీజ్‌లు వేటికీ ఇంత క్రేజ్ కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ సందడి చూపిస్తున్నది పవన్ అభిమానులే. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయిన ‘ఖుషి’కి డిసెంబరు 31న, జనవరి 1న భారీ స్థాయిలో స్పెషల్ షోలు వేశారు. 31న ఒక్కరోజే రికార్డు స్థాయిలో షోలు పడ్డాయి., వసూళ్లు కూడా అనూహ్య స్థాయిలో వచ్చాయి. రీరిలీజ్ రికార్డులన్నింటినీ ‘ఖుషి’ బద్దలు కొట్టేసింది. ఓవైపు కొత్త సినిమాలకు జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటే.. ‘ఖుషి’కి టికెట్లు దొరకడం కష్టమైన పరిస్థితి. గత రికార్డులను చాలా భారీ తేడాతో ‘ఖుషి’ స్పెషల్ షోలు బద్దలు కొట్టేయడం.. మళ్లీ ఇంకో హీరో ఫ్యాన్స్ ఈ రికార్డుల గురించి ఆలోచించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

ఐతే పవన్‌కు దీటైన హీరో అయిన మహేష్ బాబు సినిమా రీరిలీజ్‌తో అభిమానులు సవాలుకు సై అంటున్నారు. జనవరి 7న మహేష్ కల్ట్ మూవీ ‘ఒక్కడు’ స్పెషల్ షోలను రికార్డు స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ‘ఖుషి’ రికార్డులను కొట్టడమే లక్ష్యంగా భారీ ప్లానింగ్ జరుగుతోంది. కానీ అప్పుడు మహేష్ సినిమా రికార్డులను పవన్ చిత్రం ఈజీగా కొట్టేసింది కానీ.. ఇప్పుడు పవన్ మూవీ రికార్డులను అధిగమించడం మహేష్ సినిమాకు అంత తేలికైతే కాదు.

This post was last modified on January 2, 2023 2:15 pm

Share
Show comments

Recent Posts

‘గేమ్ ఛేంజర్’లో తెలుగు రాష్ట్రాల సంఘటనలు : దిల్ రాజు!

అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…

26 minutes ago

పుష్ప-2 బాక్సాఫీస్ : బాహుబలి రికార్డు బ్రేక్ అయ్యేనా??

ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…

47 minutes ago

ఫ్యాన్స్ కోరుకున్న ‘ధోప్’ స్టెప్పులు ఇవే చరణ్!

ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…

1 hour ago

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

5 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

13 hours ago