పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్లో సన్నిహితులైన వ్యక్తుల్లో బండ్ల గణేష్ ఒకడు. పవన్ మీద ఈ కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ అభిమానం ఎలాంటిదో చాలా సందర్భాల్లో చూశాం. తన సోదరుడు నాగబాబు ఇబ్బందుల్లో ఉన్న స్థితిలో సాయం చేశాడన్న కృతజ్ఞతతో బండ్ల గణేష్ నిర్మాణంలో ‘తీన్ మార్’ చేశాడు పవన్. ఆ సినిమా ఆడకపోవడంతో తర్వాత ‘గబ్బర్ సింగ్’ చేశాడు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత బండ్ల.. పవన్‌తో సినిమా కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు. తనకు సినిమా దక్కకుండా చేస్తున్నది త్రివిక్రమ్ శ్రీనివాసే అన్న అసంతృప్తి బండ్లలో ఉన్నట్లు కనిపిస్తోంది.
పవన్‌కు సినిమాలు సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న త్రివిక్రమ్.. తనకు అవకాశం రాకుండా చేస్తున్నట్లు బండ్ల భావిస్తున్నట్లుంది. ఒక పవన్ అభిమానితో జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో త్రివిక్రమ్‌ను బండ్ల బూతులు తిట్టేయడం.. ఆ తర్వాత ఆ ఆడియో క్లిప్ తనదే అని కూడా ఒప్పుకోవడం తెలిసిందే.
త్రివిక్రమ్ మీద బండ్ల తన అసంతృప్తిని తాజాగా మరో ఇంటర్వ్యూలో బయటపెట్టేశాడు. త్రివిక్రమ్ పేరెత్తకుండా ‘గురూజీ’ అని సంబోధిస్తూ బండ్ల విమర్శలు చేశాడు. “నిజమైన పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసింది నేను. ఆయనకు విపరీతమైన టాలెంట్ ఉంది. ఈయన మామూలు మనిషి కాదురా బాబూ.. ఈయన అతీతమైన వ్యక్తి. వేరే స్థాయిలో ఉండాలి.. అనుకున్నది నేను. ఇప్పుడు చాలామంది గురూజీలు, బరూజీలు అని వచ్చారు తప్పితే నాకు తెలియదు అది వేరే విషయం. పక్కన పెట్టండి. నేను ఈ రోజుకు కూడా హీరోగారంటే ఒక కృతజ్ఞత ఉంటుంది. వాళ్లు నా మీద చూపించాలని నేననుకోను” అని వ్యాఖ్యానించాడు బండ్ల.
నిర్మాతగా ఒక టైంలో వరుసగా సినిమాలు చేసిన బండ్ల.. మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ ప్రొడక్షన్ కొనసాగించాలని భావించిన బండ్ల.. తిరిగి పవన్ దగ్గరికే వెళ్లాడు. పవన్ సినిమా చేస్తానన్నాడు కానీ.. బండ్లకు కాల్ షీట్లు ఇచ్చే ఖాళీ దొరకట్లేదు. ఐతే పవన్ తనకు సినిమా చేయకుండా ఆపుతున్నది త్రివిక్రమే అన్న అనుమానం బండ్లలో బలంగా ఉన్నట్లుంది.
This post was last modified on January 2, 2023 2:10 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…