నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ కమర్షియల్ మాస్ మూవీ ‘వీరసింహా రెడ్డి’ సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 12 న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ , గ్లిమ్స్ , సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా విషయంలో అందరికీ ఉన్న డౌట్ గోపీచంద్ మాలినేని. ఫస్ట్ టైమ్ బాలయ్యతో సినిమా చేశాడు గోపీచంద్. అసలు బాలయ్య ఎలా డీల్ చేశాడో ఏ రేంజ్ యాక్షన్ చూపిస్తాడో అనే సందేహాలు ఉన్నాయి. నిజానికి బాలయ్య తో అదిరిపోయే మాస కంటెంట్ చూపించి మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు బోయపాటి. బాలయ్య ను హ్యాండిల్ చేసి హిట్ కొట్టాలంటే బోయపాటే అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ బోయపాటి లా ఇప్పుడు గోపీచంద్ బాలయ్య ను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడా ? అనే సందేహం ఫ్యాన్స్ లో నెలకొంటుంది.
ఇప్పటికే టీజర్ లో మాస్ గెటప్ , యాక్షన్ గ్లిమ్స్ చూస్తే బాలయ్య తో బ్లాక్ బస్టర్ కొడతాడనే సంకేతాలు ఇస్తున్నాడు. పైగా గోపీచంద్ లేటెస్ట్ ట్రాక్ లో వచ్చిన క్రాక్ పెద్ద హిట్టయింది. మరి బోయపాటి తర్వాత బాలయ్యతో ఆ రేంజ్ మాస్ హిట్ కొట్టే దర్శకుడిగా గోపీచంద్ పేరు వినబడుతుందా ? లేదా అనేది జనవరి 12 తెలిసిపోతుంది. అప్పటి వరకూ గోపీచంద్ మాలినేని మీద కొన్ని సందేహాలు కలగడం కామనే.
This post was last modified on January 2, 2023 12:19 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…