యంగ్ డైరెక్టర్ తో Venkatesh ? 

Hero Venkatesh Slow Down In Accepting Movies
Hero Venkatesh

విక్టరీ Venkatesh ఎఫ్ ౩ తర్వాత తన నెక్స్ట్ సినిమా డీటైల్స్ ఇంత వరకూ బయటపెట్టలేదు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ , అనుదీప్ లాంటి డైరెక్టర్స్ వెంకటేష్ కి కథలు చెప్పి ఉన్నారు. తాజాగా శైలేష్ కొలను కూడా వెంకీకి ఓ కమర్షియల్ స్క్రిప్ట్ చెప్పాడని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబో సినిమా అల్మోస్ట్ ఫిక్సయినట్టే అంటున్నారు. 

రిపబ్లిక్ డే రోజు వెంకటేష్ -శైలేష్ సినిమా ఎనౌన్స్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను నీహారిక ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తాడని టాక్. శైలేష్ విశ్వక్ సేన్ తో ‘హిట్ ఫస్ట్ కేస్’ , శేష్ తో ‘హిట్ సెకండ్ కేస్’ సినిమాలు తీసి వరుస హిట్స్ కొట్టాడు. త్వరలోనే నానితో హిట్ థర్డ్ కేస్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. హిట్ 3 కంటే ముందే వెంకీ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు శైలేష్. 

కాకపోతే ఈ సినిమా శైలేష్ జోనర్ అయిన థ్రిల్లర్ కాకుండా వెంకీ జోనర్ లో ఎమోషనల్ కామెడీ గా ఉండనుందని సమాచారం. త్వరలోనే ఈ కాంబో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకటేష్ హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్ కి వెంకీ అన్నయ్య గా కనిపించనున్నాడు. మరి యంగ్ డైరెక్టర్ శైలేష్ సీనియర్ హీరో వెంకీని ఎలా హ్యాండిల్ చేస్తాడో లెట్స్ వెయిట్ సీ.