మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వీరయ్యా వీరయ్యా అంటూ సాగిన ఆ పాటకు చంద్రబోస్ రాసిన లిరిక్స్ మేజర్ హైలైట్ అని చెప్పాలి. హీరో వీరత్వాన్ని ఈ రేంజిలో వర్ణించేవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. ఆ స్థాయి ఎలివేషన్ ఇచ్చారు చంద్రబోస్. ఐతే ఆ పాట మీద లెజెండరీ రైటర్ యండమూరి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పాటలోని “తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు”.. ‘”తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడు”.. లాంటి ప్రయోగాలను ఆయన తప్పుబట్టారు. ఈ వాక్యాలు తప్పని.. ఇవెలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. ఈ అభ్యంతరాలపై చంద్రబోస్ ఒక ఇంటర్వ్యూలో యండమూరికి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. ఆయన వెర్షన్ ఏంటో తెలుసుకుందాం పదండి.
“వీరయ్యా వీరయ్యా పాటను నేను పూర్తిగా విరోధాబాస అలంకారంలో రాశాను. ఈ అలంకారం ఏంటంటే.. పక్కపక్కన విరుద్ధమైన అర్ధం వచ్చే పదాలు రెండు ఉంటాయి. కానీ వాటిని కలిపితే ఆ విరోధం పోయి ఒక పాజిటివ్ అర్థం వస్తుంది. “తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు” వాక్యం విషయానికి వస్తే.. వశిష్ఠుడు ఎవరు, మీకు పురాణాల తెలుసా అని యండమూరి గారు అన్నారు. వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మ తేజోబలమే వశిష్ఠుడు. బ్రహ్మరుషులలో అగ్రగణ్యుడు.ఆయన ఒక శాంతప్రియుడు. ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడితో యుద్ధం చేసిన ఓడించిన గొప్పవాడు. ఎప్పుడూ శాంతంగా, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాడని వశిష్ఠుడికి పేరుంది. తుఫాను అంటే అల్లకల్లోలంగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా తపస్సు చేసుకునే వశిష్ఠుడితో హీరోను పోలుస్తూ “తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు” అని రాశాను.
“తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడు” అంటే చీకటి లాగా ఆవరించే శివుడు అనుకోవచ్చు.. లేదా గుడ్డిగా వెళ్లి కొట్టేస్తాడు అంటారు కదా ఆ అర్థంలోనూ చూడొచ్చు. గుడ్డిగా వెళ్లి కొట్టేస్తున్నా త్రినేత్రుడు కాబట్టి అన్నీ అతడికి తెలుస్తాయి అనే అర్థంలో ఈ ప్రయోగం వాడాను. యండమూరి గారు అసలు రచయితకు ‘తిమిరం’ అంటే చీకటి అని తెలుసా అని ప్రశ్నించారు. ఇది నన్నెంతో బాధించింది. ఒక రచయితకు తిమిరం అంటే చీకటి అని తెలియదని మరో రచయిత భావించారంటే ఆయన చీకట్లో బతుకుతున్నట్లే. మాకు ఈ అర్థాలు ఏమీ తెలియకుండానే పాటలు రాస్తామా?’’ అంటూ యండమూరికి సమాధానం ఇచ్చాడు చంద్రబోస్.
This post was last modified on December 30, 2022 9:09 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…