నిన్న రాత్రి స్ట్రీమింగ్ కి వచ్చేసిన మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 కొన్ని నిమిషాలకే ఆహా యాప్ ని స్థంబింపజేయడం సంచలనం రేపింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు రాత్రి తొమ్మిది గంటలకు ఒకేసారి షోని చూసేందుకు లాగిన్ కావడంతో అంత కెపాసిటీ లేని ఆహా సర్వర్ లోడ్ ని తట్టుకోలేక చేతులు ఎత్తేసింది. ప్రీమియర్ చూసేందుకు ప్లే చేసిన వాళ్ళతో పాటు అప్పటికప్పుడు చందాలు కట్టాలనుకున్న వాళ్ళ సంఖ్య లక్షలు దాటిపోయింది. ఇదంతా సెట్ చేయడానికి గంటల తరబడి సమయం పట్టడంతో సమస్య పరిష్కారానికి అర్ధరాత్రి దాటేసింది.
ఇక షో సంగతి చూస్తే ప్రభాస్ గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని హుషారుగా చిరునవ్వులతో బాలయ్య హుషారుని తోడుగా చేసుకుని ఆద్యంతం రక్తి కట్టించాడు. ముఖ్యంగా మేడం టాపిక్ మీద చాలా సేపు చర్చ జరిగింది. కృతి సనన్ పేరు ఫోటోని డైరెక్ట్ గా చూపించేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ కి చిన్నపాటి షాక్ ఇచ్చారు. అయితే ఇదంతా ఫొటోలో ఇతర ఆర్టిస్టులను కట్ చేసి సృష్టించిన ఎడిటని అసలు మ్యాటరేంటో ఆమె చెప్పింది కదాని డార్లింగ్ స్పష్టత ఇచ్చాడు. అయినా వదలకుండా వ్యవహారం రామ్ చరణ్ కు ఫోన్ చేసే దాకా తీసుకెళ్లారు బాలయ్య. ఇక్కడ ఇంకో మలుపు
ప్రభాస్ కి బాయ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని చెప్పిన చరణ్ ఆ తర్వాత మాట మార్చేసి త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడని ఇంకో ట్విస్టు ఇవ్వడం ఊహించనిది. ఆమె రెడ్డినా శెట్టినా సననా అంటూ పలు ఇంటి పేర్లు ప్రస్తావించిన బాలయ్య ఎంత కవ్వించినా సరే డార్లింగ్ మాత్రం టెంప్ట్ కాకుండా ఏమి లేదు అంటూ నవ్వుతూ దాటవేశాడు. టాపిక్ అయితే ఇక్కడితో ఆగిపోలేదు. తర్వాతి భాగంలో గోపీచంద్ కూడా దీనికి సంబంధించి ఏదో చెప్పబోతున్నాడు. అది తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే. పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం చేసుకుంటానన్న ప్రభాస్ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.
This post was last modified on December 30, 2022 2:12 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…