కొన్ని సినిమాలు థియేటర్లలో సోసోగా ఆడి వెళ్లిపోతుంటాయి. కానీ ఓటీటీలోకి వచ్చాక వాటిని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతుంటారు. వాటికి గొప్ప ఆదరణ కట్టబెడుతుంటారు. గత రెండు మూడేళ్లలో ఈ కోవలో చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులోకి చేరిన సినిమా.. Masuda.
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిత్రాలతో అభిరుచిని చాటుకున్న యువ నిర్మాత రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. ఇదొక హార్రర్ మూవీ. ఐతే రెగ్యులర్‌గా చూసే హార్రర్ సినిమాలకు కొంచెం భిన్నంగా సాగిందిది. ఒక ముస్లిం మంత్రగత్తె దయ్యం రూపంలో వచ్చి ఒక అమ్మాయిని పీడించడం.. దాని విరుగుడు కోసం ఆమె తల్లి, వీరి కుటుంబానికి సన్నిహితుడైన ఓ కుర్రాడు కలిసి పోరాడే క్రమంలో కథ నడుస్తుంది.
హార్రర్ సినిమాను కామెడీతో చెడగొట్టకుండా.. జెన్యూన్ హార్రర్ మూమెంట్స్‌తో ఎక్కడా ఇంటెన్సిటీ తగ్గకుండా ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు సాయికిరణ్. ఐతే పేరున్న కాస్టింగ్ లేకపోవడం వల్లో ఏమో ఈ చిత్రం థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ఐతే ఇటీవలే ఈ చిత్రాన్ని Aha ఓటీటీలో రిలీజ్ చేశారు.
సినిమాకు మంచి రివ్యూలు, టాక్ ఉండడంతో ఇక్కడ ప్రేక్షకులు ‘మసూద’ను విరగబడి చూస్తున్నారు. అప్పుడే ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. పెద్ద పెద్ద సినిమాలకు వచ్చే రేంజ్ వ్యూయర్ షిప్ ఇది. దీన్ని బట్టి ‘మసూద’ ఓటీటీలో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. థియేటర్లలో చూసిన వాళ్లు సినిమా జస్ట్ బాగుందని మాత్రమే అన్నారు. కానీ ఓటీటీలో చూస్తన్న జనాలు మాత్రం ఈ చిత్రాన్ని ఒక రేంజిలో పొగుడుతున్నారు. కొత్తగా ఫుల్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ‘మసూద’కు సీక్వెల్ తీయాలని చూస్తున్న చిత్ర బృందానికి ఇది మంచి ఉత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on December 29, 2022 11:53 am
పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన…
ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…
ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్,…
ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి…
థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే…