Kushi
ఇంకో మూడు రోజుల్లో ‘Kushi’ సినిమా రీరిలీజ్ సందడితో తెలుగు రాష్ట్రాలు ఊగిపోనున్నాయి. Pawan Kalyan కెరీర్లో బిగ్గెస్ట్ హిట్, అలాగే కల్ట్ స్టేటస్ ఉన్న సినిమా కావడం.. ఫ్యాన్ మూమెంట్స్, అదిరిపోయే పాటలు, ఫైట్లు ఉన్న సినిమా కావడం.. స్వయంగా నిర్మాత ఎ.ఎం.రత్నమే రంగంలోకి దిగి సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘Kushi’ స్పెషల్ షోల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ‘Jalsa’ లాంటి యావరేజ్ మూవీకే అంత హంగామా చేసిన పవన్ ఫ్యాన్స్ ‘Kushi’కి ఇంకెంత చేస్తారో అన్న చర్చ నడుస్తోంది. ఐతే ఇలా పాత సినిమాలు రీ రిలీజ్ అయినపుడు.. ఆటోమేటిగ్గా యుఎస్‌లో కూడా షోలు పడుతుంటాయి.పోకిరి, జల్సా, చెన్నకేశవ రెడ్డి సినిమాలకు అక్కడ పెద్ద స్థాయిలోనే షోలు వేశారు. కానీ ‘Kushi’కి మాత్రం ఆ అవకాశం దక్కడం లేదు.
యుఎస్‌లోని ఏ థియేటర్ కూడా ‘Kushi’ స్పెషల్ షోలు ప్రదర్శించడానికి ముందుకు రాలేదు. అందుక్కారణం.. ఇంతకుముందు సినిమాల రీ రిలీజ్ టైంలో అభిమానులు అతి చేయడం.. థియేటర్లు దెబ్బ తినడం.. వేరే షోలకు చాలా ఇబ్బంది ఎదురు కావడమే ఇందుకు కారణమట. మన దగ్గర కూడా ఈ రిరిలీజ్‌ల టైంలో కొన్ని థియేటర్లు ధ్వంసమై లక్షల్లో నష్టం రావడం తెలిసిందే.
ఐతే ఇక్కడైతే చెల్లిపోయింది కానీ.. యుఎస్‌లో ఎగ్జిబిటర్లకు ఒళ్లు మండినట్లుంది. అందుకే ‘Kushi’ స్పెషల్ షోలకు స్క్రీన్లు ఇవ్వడానికి నిరాకరించారట. దీంతో Pawan Kalyan అభిమానులకు తీవ్ర నిరాశ తప్పట్లేదు. చివరి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ థియేటర్ల యాజమాన్యాలు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
ఏపీలో కాకినాడ లాంటి చోట్ల కూడా ఈ స్పెషల్ షోలు ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. అభిమానుల సంబరాలు శ్రుతి మించకుండా చూసుకోకుండా మున్ముందు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు.
This post was last modified on December 28, 2022 4:09 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…