మెగాస్టార్ Chiranjeevi పెద్ద మాస్ హీరోయే కానీ.. కామెడీ పండించడంలో ఆయన పెద్ద పెద్ద కమెడియన్లకు ఏమాత్రం తీసిపోరు. చంటబ్బాయి, అన్నయ్య, శంకర్ దాదా లాంటి సినిమాలు చూస్తే చిరు ఏ రేంజిలో కామెడీ చేయగలరో అర్థం అవుతుంది.
వీటన్నింట్లో కూడా ‘అన్నయ్య’ సినిమా చాలా ప్రత్యేకం. అందులో చూడ్డానికి రఫ్‌గా కనిపించినప్పటికీ.. హీరోయిన్ సౌందర్యను చూడగానే సిగ్గు మొగ్గలైపోయే పాత్రను చిరు పండించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ కామెడీ టైమింగ్ ఇంకెవరికీ సాధ్యం కాదు అనిపిస్తుంది ఆ సన్నివేశాలు చూస్తుంటే. ఐతే బయట కూడా చిరు అప్పుడప్పుడూ ఇదే టైమింగ్‌ను చూపిస్తుంటాడు. వేదికల మీద హీరోయిన్ల గురించి మాట్లాడేటపుడు ఆయన చిలిపితనాన్నంతా చూపించేస్తుంటాడు.
తన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా చిరు తన కొంటెతనాన్ని చూపించాడు. ఈ సినిమాలో Urvashi Rautelaతో చిరు ‘బాస్ పార్టీ’ అనే పాట చేసిన సంగతి తెలిసిందే., ఈ పాట గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. పాట భలే వచ్చింది, ఇంత ఊపున్న పాటలో ఎవరిని పెడుతున్నారని అడిగితే ఊర్శశి పేరు చెప్పారని.. తాను ఓకే అన్నానని, ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని అన్నాడు చిరు.
ఆయన ఊర్వశి గురించి మాట్లాడుతుండగా.. ఆమె దగ్గరికి వచ్చింది. చిరు ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ మెలికలు తిరిగేశాడు. అచ్చంగా ‘అన్నయ్య’ సినిమాలో సౌందర్యతో టచింగ్స్ అయినపుడు సిగ్గు మొగ్గలైపోయే హావభావాన్ని రిపీట్ చేశాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాక చెయ్యి అతుక్కుపోయిందంటూ గట్టిగా లాగినట్లు చేతిని వెనక్కి తీసుకోవడం విశేషం. దీంతో వేదిక మీదున్న వాళ్లు.. కిందున్న విలేకరులు గొల్లుమన్నారు. ఇంతలో రాజేంద్రప్రసాద్ వచ్చి చిరును పక్కకు పిలిచి మంచి నీళ్లు కావాలా అంటూ ఆటపట్టించడం విశేషం.
This post was last modified on December 28, 2022 11:42 am
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…