హిట్టుల్లో శ్రీలీల… రెమ్యునరేషన్ చుక్కల్లోనా ?

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది శ్రీలీల. ఈ సాండల్ వుడ్ బ్యూటీ చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలున్నాయి. పెళ్లి సందడి సినిమాతో రాఘవేంద్ర రావు పరిచయం చేసిన శ్రీలీల కుర్ర కారుని ఎట్రాక్ట్ చేసి ఆ సినిమాకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టి, తాజాగా ధమాకా సక్సెస్ లో కూడా అమ్మడు కీ రోల్ ప్లే చేస్తుంది. రిలీజ్ కి ముందే శ్రీలీల డాన్సులు , గ్లామర్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. మాస్ ఆడియన్స్ కి ధమాకా తో బాగా దగ్గరయిపోయింది.

ధమాకా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు కన్నడ బ్యూటీ రెమ్యునరేషన్ డబుల్ చేసే ప్లాన్ లో ఉందట. ప్రస్తుతం శ్రీ లీల కోటి లోపు రెమ్యునరేషన్ అందుకుంటుంది. తాజాగా మహేష్ సినిమాకు కోటి పైనే తీసుకుందని తెలుస్తుంది. ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ డబుల్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేయడానికి రెడీ అవుతుందని టాక్. ప్రస్తుతానికి కమిట్ అయిన సినిమాల వరకు ముందు మాట్లాడిన రెమ్యునరేషన్ కే చేయనుందట.

కానీ ఇకపై తనను అప్రోచ్ అయ్యే నిర్మాతల దగ్గర నుండి మాత్రం రెండు కోట్ల వరకూ అడగాలనే ఆలోచనలో ఉందట. ఈ విషయం తాజాగా ఆమె మేనేజర్ తో కూడా చెప్పేసిందట. శ్రీలీల వ్యవహారాలన్నీ ఆమె తల్లి చూసుకుంటుంది. సో రెమ్యునరేషన్ పెంచే ఈ విషయంలో కూడా ఆమె తల్లి నిర్ణయమే అనుకోవచ్చు.