Movie News

దిల్ రాజును వదలని అజిత్ ఫ్యాన్స్

టాలీవుడ్లో చాలామంది అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రమే.. వారిసు/వారసుడు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా దిల్ రాజు చేసిన ఒక కామెంట్ దుమారం రేపింది.

తమిళంలో విజయే నంబర్ వన్ హీరో అని.. సంక్రాంతికి పోటీగా రిలీజవుతున్న అజిత్ మూవీ ‘తునివు’ కంటే దీనికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని అడుగుతానని ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. విజయ్‌ను నంబర్ వన్ హీరో అనడం, అజిత్ సినిమా కంటే విజయ్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలనడం అజిత్ ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. అప్పట్నుంచి వాళ్లు రాజును టార్గెట్ చేస్తున్నారు.

ఐతే రాజు ఏదో ఫ్లోలో ఇలా మాట్లాడేశారేమో, ఈ వ్యాఖ్యలను సరిదిద్దుకుంటారేమో అనుకుంటే.. తాజాగా చెన్నైలో జరిగిన ‘వారిసు’ ఆడియో వేడుకలో మళ్లీ అజిత్ అభిమానులను ఉడికించేలా మాట్లాడాడు రాజు. ‘వారిసు’కు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో ఈ సంక్రాంతి మాదే అని రాజు స్టేట్మెంట్ ఇవ్వడం అజిత్ ఫ్యాన్స్‌కు రుచించట్లేదు.

ఓవైపు ‘తునివు’ డైరెక్టర్ వినోద్ ఆ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. సంక్రాంతికి తునివుతో పాటు వారిసు కూడా బాగా ఆడాలని వ్యాఖ్యానించాడు. కానీ రాజుతో పాటు వంశీ పైడిపల్లి ‘వారిసు’ ఆడియో వేడుకలో ‘‘ఈ సంక్రాంతి మాదే’’ అనే స్టేట్మెంట్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఈ స్టేట్మెంట్ల తర్వాత అజిత్ అభిమానులు మరోసారి రాజును టార్గెట్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అజిత్ అభిమానులను రెచ్చగొడుతున్నాడంటూ రాజును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అభిమానుల మధ్య చిచ్చు పెడుతున్నాడంటూ ఆయన మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు.

This post was last modified on December 25, 2022 10:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘గేమ్ ఛేంజర్’లో తెలుగు రాష్ట్రాల సంఘటనలు : దిల్ రాజు!

అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…

32 minutes ago

పుష్ప-2 బాక్సాఫీస్ : బాహుబలి రికార్డు బ్రేక్ అయ్యేనా??

ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…

53 minutes ago

ఫ్యాన్స్ కోరుకున్న ‘ధోప్’ స్టెప్పులు ఇవే చరణ్!

ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…

1 hour ago

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

5 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

13 hours ago