Tunisha Sharma.. ఉత్తరాది జనాలంత ఈ అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ హిందీ టీవీ నటి శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో ఆత్మహత్యలు కొత్తేమీ కాదు కానీ.. ఈ అమ్మాయి కెరీర్లో ఎదుగుతున్న దశలో, కేవలం 20 ఏళ్ల వయసులోనే ప్రాణాలు తీసుకోవడం పెద్ద షాక్.
అది కూడా Tunisha Sharma నటిస్తున్న టీవీ షోకు సంబంధించిన షూటింగ్ స్పాట్లోనే ఒక గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఆత్మహత్యకు పాల్పడడానికి 6 గంటల ముందు టునీషా మేకప్‌తో ఉన్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఆమె మామూటుగానే కనిపిస్తోంది. ఆత్మహత్యకు పాల్పడే మానసిక స్థితిలో ఉన్న అమ్మాయి ఇలా క్యాజువల్‌గా ఎలా ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుందన్నది అర్థం కాని విషయం.
ఇదిలా ఉంటే.. తాను చేస్తున్న టీవీ షోలో ఆత్మహత్యకు పాల్పడే సన్నివేశం చిత్రీకరణలోనే టునీషా పాల్గొంటోందట. Tunisha Sharma మణికట్టు దగ్గర కత్తితో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడే సన్నివేశానికి సంబంధించి రిహార్సల్స్ చేస్తున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది.
అప్పటికే ఉన్న సమస్య గురించి ఆలోచిస్తూ ఆ సన్నివేశం చిత్రీకరణలో పాల్గొనడం ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా టునీషా తల్లి తన కూతురి ఆత్మహత్యకు కారణమంటూ ఆమె బాయ్ ఫ్రెండ్ షీజాన్ ఖాన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. షీజాన్‌తో టునీషా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
తనతో పెళ్లికి షీజాన్ నిరాకరించడంతోనే Tunisha Sharma తీవ్ర నిర్ణయం తీసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు టునీషాతో ప్రేమలో ఉన్న షీజాన్.. ఇటీవల శ్రద్ధ అనే మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని.. తనను పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. కాగా ఇది హిందూ అమ్మాయిల మీద ముస్లిం అబ్బాయిలు చేసే ‘లవ్ జిహాద్’ ఎటాకే అంటూ షీజాన్ మీద హిందూ మద్దతుదారులు అతణ్ని టార్గెట్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates