మన పురాణ పురుషుల పాత్రల్లో ఒక్కోదాన్ని తలుచుకోగానే ఒక నటుడు కళ్ల ముందు మెదులుతాడు. రాముడు, కృష్ణుడు లాంటి పాత్రల్ని గుర్తు తెచ్చుకోగానే ఎన్టీఆర్ రూపం సాక్షాత్కరిస్తుంది. ఆ పాత్రలతో ఆయన వేసిన ముద్ర అలాంటిది మరి. అలాగే రావణాసురుడు, ఘటోత్కచుడు లాంటి పాత్రలతో ఎస్వీఆర్ కూడా అలాంటి బలమైన ముద్రే వేశారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆ పాత్రలు ముద్రించుకుపోయేలా చేశారు.
ఇలాగే యముడు అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు.. కైకాల సత్యనారాయణ. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో సత్యనారాయణ హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన పాత్రలు వేశారు. ఎక్కువగా ఆయన మెప్పించింది విలన్ పాత్రలతోనే. ఐతే కెరీర్లో చేసిన మిగతా పాత్రలన్నీ ఒకెత్తయితే.. యముడి అవతారంలో కనిపించిన యమగోల, యమలీల సినిమాలు మరో ఎత్తు.
మామూలుగా యముడు అంటే మనుషుల ప్రాణాలు తీసి, వారిని చిత్రహింసలు పెట్టేవాడిగా పేరుంది. కానీ ఆ పాత్రను తలుచుకోగానే జనాల పెదవులపై నవ్వులు విరబూసేలా చేసిన ఘనత కైకాలదే. దాన్నొక లవబుల్ క్యారెక్టర్‌గా మార్చడం ఆయనకే సాధ్యం అయింది. 1977లో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘యమగోల’ అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను మించి హైలైట్ అయ్యారు యముడిగా కైకాల.
మళ్లీ 1994లో చేసిన ‘యమలీల’లో అదే పాత్రతో అబ్బురపరిచారు. అప్పటి పిల్లలందరూ కైకాలను ఓన్ చేసుకుని.. ఆయనతో కనెక్టయ్యేలా చేసిన పాత్ర అది. ఇప్పుడు పిల్లలంతా హాలీవుడ్ సూపర్ హీరో పాత్రలతో కనెక్టయిపోయారు కానీ.. 80, 90 కిడ్స్‌ను అంతకుమించి అలరించింది కైకాల ‘యమలీల’లో చేసిన యముడి పాత్ర. ముఖ్యంగా అందులో హిమక్రీములు అంటూ ఐస్ క్రీంలు లాగించే సీన్లో కైకాల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్లో మరెన్నో అద్భుతమైన పాత్రలు చేసినా.. ఇది చాలా ప్రత్యేకం. ఇప్పుడు చూసినా.. ఇంకొన్ని దశాబ్దాల తర్వాత చూసినా కూడా కనెక్టయ్యేలా యముడి పాత్రను కైకాల పోషించిన తీరు నభూతో నభవిష్యతి.
This post was last modified on December 23, 2022 9:33 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…