తమిళంలో పెద్దగా అంచనాలు లేకుండా చాలా తక్కువ బడ్జెట్ తో రూపొంది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న లవ్ టుడే తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కొంత ఆలస్యం కావడం, నిర్మాత దిల్ రాజు అయినప్పటికీ ప్రమోషన్ విషయంలో అలసత్వం జరగడం వల్ల చేరుకోవాల్సిన స్థాయిలో ఇక్కడ భారీ హిట్టు కాలేదన్నది వాస్తవం. ఇదంతా ఎలా ఉన్నా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ మాత్రం సౌత్ లోనే కాదు నేషనల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యాడు. ఇంతకు ముందు జయం రవితో కోమలి చేసినప్పుడూ ఇంత పేరు రాలేదు.
అప్పట్లో కోమలి నిర్మాతలు ఒక కారుని కానుకగా ఇవ్వబోతే దానికి బదులుగా డబ్బులివ్వమని కోరి మూడేళ్లు వాటితోనే ఖర్చుల్ని నెట్టుకొచ్చి లవ్ టుడే తీసిన తీరు గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు. ఇంత కష్టానికి తగ్గ ఫలితం ప్రదీప్ కు దక్కినట్టు కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ని త్వరలోనే డైరెక్ట్ చేయబోతున్నట్టు చెన్నై టాక్. ఇటీవలే లైకా సంస్థ సూపర్ స్టార్ తో రెండు ప్రాజెక్టులు లాక్ చేసింది. అందులో దర్శకుడు సిబిది ఒకటి. శివకార్తికేయన్ డాన్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇతను చెప్పిన కథ మొదట్లో బాగుందనిపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
కట్ చేస్తే ఇప్పుడు ఫైనల్ వెర్షన్ అంత సంతృప్తికరంగా రాలేదని ప్రస్తుతానికి దాన్ని ఆపేశారట. ఆ స్థానంలో ప్రదీప్ రంగనాథన్ కు ఛాన్స్ ఇచ్చే సూచనలు ఉన్నట్టుగా చెబుతున్నారు. రజని గత రెండు మూడేళ్లుగా కేవలం యంగ్ డైరెక్టర్స్ తో చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. పా రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇలా వీళ్లంతా కొత్త తరం ప్రతినిధులే. తనలో వింటేజ్ హీరోయిజంని కరెక్ట్ గా చూపించేది వీళ్ళేనని గుర్తించి దానికి తగ్గట్టే సెలక్షన్ స్టయిల్ ని పూర్తిగా మార్చేశారు. మరి ఈయనతో చేయడమంటే ప్రదీప్ జాతకం మారిపోయినట్టే. అఫీషియల్ అయ్యేదాకా చూడాలి.
This post was last modified on December 20, 2022 3:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…