కెజిఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్స్ తో శాండల్ వుడ్ స్థాయి అమాంతం పెరిగిపోయిందని అక్కడి సినిమా ప్రేమికులు సంతోషపడుతున్న సమయంలో ఒక స్టార్ హీరో మీద పబ్లిక్ గా చెప్పుతో దాడి చేసిన ఘటన కన్నడ పరిశ్రమను ఊపేస్తోంది. దర్శన్ మనకూ అంతో ఇంతో సుపరిచితుడే. ఆ మధ్య రాబర్ట్ అనే ప్యాన్ ఇండియా మూవీ వచ్చింది కదా ఆ హీరోనే ఇతను. మనకు రవితేజ ఎలానో బెంగళూరు సైడ్ తనకో ఆ రేంజ్ లో పెద్ద మార్కెట్ ఉంది. త్వరలో క్రాంతిని భారీ ఎత్తున విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ సిద్ధమవుతోంది. దీని ప్రమోషన్లు జరుగుతున్నాయి
అందులో భాగంగా దర్శన్ హొస్పెట్ వెళ్ళాడు. అక్కడో వ్యక్తి అందరూ చూస్తుండగానే స్టేజి మీద మాట్లాడుతున్న దర్శన్ మీదకు చెప్పు విసిరాడు. అది నేరుగా అతని భుజాల మీద పడి దాదాపు చెంపను తాకినంత పని చేసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మరి పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పారు. అప్పటికే రక్షణగా ఉన్న బలగాలు చాలక అదనపు ఫోర్స్ ని పిలిపించాల్సి వచ్చింది. ఆ చెప్పు వేసిన వ్యక్తిని దివంగత పునీత్ రాజ్ కుమార్ అభిమానిగా గుర్తించి ఆ మేరకు సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. సంఘటన జరిగిన సమయంలోనే వాడికి దేశశుద్ది జరిగిపోయింది.
గతంలో దర్శన్ ఓ ఇంటర్వ్యూలో పునీత్ గురించి చేసిన వ్యాఖ్యలు, అతను బ్రతికున్నపుడు ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగిన వివాదాలు ఇప్పుడీ పరిణామాలకు దారి తీశాయి. ఈగ విలన్ సుదీప్ ట్విట్టర్ లో దీని గురించి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ ఇలాంటివి చేయొద్దని పిలుపునిచ్చాడు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ సైతం ఖండించారు. దర్శన్ మాత్రం ఎలాంటి ఉద్రేకానికి గురవ్వొద్దంటూ శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శన్ లైట్ బాయ్ గా రాజ్ కుమార్ ఫ్యామిలీ బ్యానర్ లోనే పని చేస్తూ ఇక్కడిదాకా ఎదిగాడు. మాస్ లో ఫాలోయింగ్ పెరిగాక ఇలాంటి కాంట్రావర్సిలు పెరిగాయి. క్రాంతి జనవరి 26 రిలీజ్ కానుంది
This post was last modified on December 20, 2022 1:27 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…