Movie News

ఇలాంటి సాహసం ఆ హీరో ఒక్కడే చేయగలడు

వరల్డ్ సినిమాలో బెస్ట్ యాక్షన్ మూవీస్ లిస్టు తీస్తే అందులో కచ్చితంగా ఉండే చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా ఆరు సినిమాలు రాగా.. అన్నీ బ్లాక్‌బస్టర్లే. ఈ యాక్షన్ చిత్రాలతో టామ్ క్రూజ్‌కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. స్టంట్స్ విషయంలో అతను ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలతో. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనుకరించే ప్రయత్నం చేశారు. యాజిటీజ్ కాపీ కొట్టాలని కూడా చూశారు. కానీ టామ్ క్రూజ్ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడం అంత తేలికైన విషయం కాదు.

ఐతే ఇప్పటిదాకా అతను చేసిన స్టంట్ విన్యాసాలన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో రానున్న కొత్త చిత్రం ‘డెడ్ రాకెనింగ్ పార్ట్-1’ కోసం చేసిన విన్యాసం మరో ఎత్తు. ఇప్పుడు వరల్డ్ వైడ్ సినీ ప్రేమికుల చర్చలన్నీ ఈ స్టంట్ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇటీవలే ‘అవతార్-2’ సినిమా విడుదల సందర్భంగా ఐమాక్స్ స్క్రీన్లలో త్రీడీ వెర్షన్లో ‘మిషన్ ఇంపాజిబుల్-7’ కోసం క్రూజ్ చేసిన విన్యాసం తాలూకు వీడియోను రిలీజ్ చేశారు. అది చూసి ప్రేక్షకులు ఎందుకంత ఎగ్జైట్ అవుతూ పోస్టులు పెట్టారో.. ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజైన ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది.

ఒక కొండ మీద భారీ రెయిలింగ్ ఏర్పాటు చేసి, దాని మీద స్పోర్ట్స్ బైకేసుకుని రయ్యిన దూసుకెళ్లి వందల అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూకే ఈ సన్నివేశాన్ని డూప్ లేకుండా, రియలిస్టిగ్గా టామ్ క్రూజ్ చేసిన తీరుకు ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. అతడి స్థానంలో మనం ఎలా ఉంటుందన్న ఊహ కూడా షేక్ చేసేస్తుంది. దీని కోసం క్రూజ్ చేసిన రిహార్సల్స్, పడ్డ కష్టం అంతా కూడా ఈ వీడియోలో చూపించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి పర్ఫెక్ట్‌గా ఈ మైండ్ బ్లోయింగ్ స్టంట్‌ను పూర్తి చేసిన విధానం కళ్లు చెదిరిపోయేలా ేచేసేదే. ఈ వీడియో చేశాక ఇంత సాహసం చేసే హీరో టామ్ క్రూజ్ మాత్రమే అని ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

This post was last modified on December 20, 2022 1:06 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

3 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

4 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

4 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

5 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago