రామ్ గోపాల్ వర్మ చేష్టలు, మాటల గురించి ఆశ్చర్యపోతూ మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంతకంటే పతనం ఉండదనుకున్న ప్రతిసారీ.. ఇంకో అడుగు కిందికి దిగిపోయి ప్రవర్తిస్తూ, మాట్లాడుతూ ఉంటాడు వర్మ.
ఇటీవల ‘డేంజరస్’ అనే తన కొత్త చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆషు రెడ్డితో చేసిన ఇంటర్వ్యూలో ఒక పోర్న్ స్టార్ తరహాలో ఆమె పాదాన్ని వర్మ తన నోటితో నాకిన తీరు జుగుప్సాకరంగా అనిపించింది. దీని మీద తీవ్ర విమర్శలు రాగా.. దానిపై వర్మ తన వెర్షన్ ఏదో వినిపించాడు.
ఆ తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలో మరొకటేదో చేశాడు. దాన్ని జనాలు అసలు పట్టించుకోలేదు. కాగా ఇప్పుడు వర్మ గురించి ఆయన తల్లి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ ఈ జన్మకు మారడంటూ తన గురించి స్టేట్మెంట్ ఇచ్చారావిడ. అంత వరకు బాగానే ఉంది తాను తన కొడుకుతో కలిసి అతను తీసిన ‘జీఎస్టీ’ సినిమా చూసినట్లు సూర్యకుమారి వెల్లడించడం గమనార్హం. జీఎస్టీ పూర్తి నామం.. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’.
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ తీసిన పోర్న్ మూవీ ఇది. కొన్ని నిమిషాల నిడివి ఉండే ఈ షార్ట్ మూవీ అప్పట్లో దుమారం రేపింది. ఇండియాలో పోర్న్ సినిమాల చిత్రీకరణపై నిషేధం ఉండడంతో వర్మ కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడ్డాడు కూడా. తాను ఈ సినిమా ఇక్కడ తీయలేదంటూ ఆయన అధికారులకు వివరణ ఇచ్చి ఈ కేసు నుంచి బయటపడ్డట్లున్నాడు. మొత్తానికి అది నగ్నత్వం ఉన్న పోర్న్ మూవీ అనడంలో ఎవరికీ సందేహాల్లేవు.
అలాంటి సినిమాను తాను వర్మ పక్కన కూర్చుని చూసినట్లు ఆయన తల్లి చెప్పడం చూసి జనాలకు దిమ్మదిరిగిపోతోంది. కాకపోతే దీని మీద ఏమీ కామెంట్ చేయలేక ఊరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన కొడుకు చుట్టూ ముసురుకునే వివాదాల గురించి సూర్యకుమారి మాట్లాడుతూ.. వర్మ గురించి ఎవరేమంటున్నారో తనకు తెలుసని, కానీ తన కొడుకు గురించి తనకో ఆలోచన ఉందని, అతను ఈ జన్మకు మారడని ఆమె స్పష్టం చేశారు.
తనకు తానుగా అనిపిస్తే మార్చుకుంటాడేమో కానీ.. ఎవరో ఏదో అంటున్నారని మాత్రం అతను మారడని ఆమె పేర్కొన్నారు. వర్మకు తనంటే చాలా ఇష్టమని.. అతను ఇంటికి వచ్చినపుడు తాను కనిపిస్తే కళ్లలో ఒక మెరుపు కనిపిస్తుందని సూర్యకుమారి చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…