షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ నుంచి ఇటీవలే రిలీజైన ‘బేషారమ్ రంగ్’ పాట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అందులో హీరోయిన్ దీపికా పదుకొనే వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేసింది. ఆమె దుస్తులు.. హావభావాల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఐతే సామాన్య ప్రేక్షకులు ఈ పాట గురించి ఏం కామెంట్ చేసినా ఓకే కానీ.. ఇందులోకి రాజకీయ నాయకులు తలదూర్చడమే అభ్యంతరకరంగా మారింది.
దీపిక కాషాయ రంగు దుస్తులు ధరించి ఎక్స్‌పోజింగ్ చేయడాన్ని తప్పుబడుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి విమర్శలు చేయడం, ఆ దుస్తులు మార్చకుంటే సినిమాను తమ రాష్ట్రంలో ఆడనివ్వబోమన్నట్లుగా హెచ్చరికలు చేయడం దుమారం రేపింది. దీని మీద ఇంకో వర్గం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ‘పఠాన్’ టీంకు బాసటగా నిలుస్తూ పోస్టులు పెడుతుండడం చూస్తున్నాం.
ఇలాంటి టైంలో ఫిలిం ఇండస్ట్రీకే చెందిన ఒక వ్యక్తి ‘బేషారమ్ రంగ్’ పాట మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘శక్తిమాన్’గా నిన్నటితరం ప్రేక్షకులను అమితంగా అలరించిన ముకేష్ ఖన్నా.. ఈ పాట మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.. బేషారమ్ రంగ్ పాటను చాలా అసభ్యకరంగా చిత్రీకరించారని అన్నాడు.
‘‘బాలీవుడ్ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువ అవుతోంది. ఇప్పుడు హీరోయిన్లను పొట్టి పొట్టి దుస్తుల్లో చూపిస్తున్న ఫిలిం మేకర్స్.. రేప్పొద్దున నగ్నంగా కూడా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మన దేశం స్పెయిన్ లేదా స్వీడన్ కాదు. ఎవరి మనోభావాలకు, నమ్మకాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూడడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదు. బేషారమ్ రంగ్ పాటను అసభ్యకరంగా చిత్రీకరించారు. ఇతరుల ఫీలింగ్స్‌ను రెచ్చగొట్టేలా ఉన్న ఈ పాటను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించింది’’ అని ముకేష్ ఖన్నా ప్రశ్నించాడు.
This post was last modified on December 17, 2022 5:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…